IPL 2025: రాజస్తాన్ పై ముంబై ఘన విజయం..

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు భారీ స్కోర్ చేసింది.

IPL 2025: రాజస్తాన్ పై ముంబై ఘన విజయం..

Courtesy BCCI

Updated On : May 1, 2025 / 11:17 PM IST

IPL 2025: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో ఊపు మీదుంది. తాజాగా రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షోతో రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు భారీ స్కోర్ చేసింది. 218 పరుగుల బిగ్ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్ 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా ఎంఐ 100 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

Also Read: మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 షెడ్యూల్ వ‌చ్చేసింది.. జూన్ 12 నుంచి.. లార్డ్స్ లో ఫైన‌ల్..

ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రాజస్తాన్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఆర్ ఆర్ వరుసగా వికెట్లను కోల్పోయింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, కర్ణ్ శర్మ తలో 3 వికెట్లు పడగొట్టారు. బుమ్రా 2 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్, హార్ధిక్ పాండ్య చెరో వికెట్ తీసుకున్నారు.

ఈ సీజన్ లో ముంబైకి ఇది వరుసగా 6వ విజయం. తాజా విజయంతో పాయింట్ల టేబుల్ లో 3వ స్థానం నుంచి అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది ఎంఐ. ఈ సీజన్ లో మొత్తం 11 మ్యాచులు ఆడిన ముంబై.. 7 విజయాలు నమోదు చేసింది. అటు రాజస్తాన్ రాయల్స్ 11 మ్యాచులు ఆడగా 8 మ్యాచుల్లో ఓటమి పాలైంది. పాయింట్ల టేబుల్ లో 8వ స్థానంలో ఉంది.

స్కోర్లు:
ముంబై ఇండియన్స్ – 217/2
రాజస్తాన్ రాయల్స్ – 117(16.1 ఓవర్లలో ఆలౌట్)