IPL 2025: ఫైనల్ పోరు.. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

Courtesy BCCI
IPL 2025: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ఇవాళ్టితో తెరపడనుంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా వారికిదే తొలి ఐపీఎల్ టైటిల్ కానుంది.
లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్, బెంగళూరు.. ఫైనల్ చేరే క్రమంలోనూ తమదైన ముద్ర వేశాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ జట్టు క్వాలిఫయర్ -2లో ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఇప్పటికే మూడుసార్లు తలపడ్డాయి.
పంజాబ్ కింగ్స్ తుది జట్టు..
ప్రియాంశ్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జేమీసన్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజువేంద్ర చాహల్.
ఆర్సీబీ తుది జట్టు..
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పటీదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రొమారొయో షెఫర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, జోష్ హేజిల్‌వుడ్.
ఆర్సీబీ 2009, 2011, 2016 సంవత్సరాల్లో ఫైనల్స్ వరకు చేరినా విజేతగా నిలవలేకపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత 2025 సీజన్‌లో మరోసారి ఫైనల్‌కు అర్హత సాధించి టైటిల్‌పై గురి పెట్టింది. అటు పంజాబ్ కింగ్స్ జట్టు 2014లో ఒకసారి ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇన్నేళ్లకు మళ్లీ ఫైనల్ బరిలో నిలిచి తొలి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా.
గత 18 ఏళ్లుగా ఈ రెండు జట్లకు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇవాళ్టి ఫైనల్‌లో ఏ జట్టు విజయం సాధించినా వారికిదే తొలి ఐపీఎల్ టైటిల్ కానుంది.