IPL 2025 Playoffs : ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే.. ఎవ‌రితో ఎవ‌రు త‌ల‌ప‌డ‌తారంటే.. పంజాబ్‌, ఆర్‌సీబీల‌కు గోల్డెన్ ఛాన్స్‌..

ప్లేఆఫ్స్‌లో ఎన్ని మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏ జ‌ట్టు ఎవ‌రితో పోటీ ప‌డ‌నుంది వంటి విష‌యాల‌ను చూద్దాం.

IPL 2025 Playoffs : ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే.. ఎవ‌రితో ఎవ‌రు త‌ల‌ప‌డ‌తారంటే.. పంజాబ్‌, ఆర్‌సీబీల‌కు గోల్డెన్ ఛాన్స్‌..

IPL 2025 playoffs schedule Do you know Who will play against whom

Updated On : May 28, 2025 / 12:04 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో లీగ్ ద‌శ పూరైంది. మంగ‌ళ‌వారం ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌, రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఎకానా స్టేడియం ఆతిథ్యం ఇచ్చిన‌ ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానానికి దూసుకువెళ్లింది. ఈ క్ర‌మంలో క్వాలిఫ‌య‌ర్‌-1కు అర్హ‌త సాధించింది.

ఇక ప్లేఆఫ్స్‌లో ఎన్ని మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏ జ‌ట్టు ఎవ‌రితో పోటీ ప‌డ‌నుంది వంటి విష‌యాల‌ను చూద్దాం.

LSG vs RCB : ఆర్‌సీబీ పై ఓట‌మి.. ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్‌కు బీసీసీఐ బిగ్ షాక్‌..

పంజాబ్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైటాన్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించాయి. ఇందులో పాయింట్ల ప‌ట్టిక‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న పంజాబ్‌, ఆర్‌సీబీ జ‌ట్లు క్వాలిఫ‌య‌ర్ 1లో త‌ల‌ప‌డ‌నున్నాయి. మే 29న చంఢీగ‌డ్‌లోని ముల్ల‌న్‌పూర్ వేదిక‌గా క్వాలిఫ‌య‌ర్ 1 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. ఓడిపోయిన జ‌ట్టుకు ఫైన‌ల్ చేరుకునేందుకు మ‌రో ఛాన్స్ ఉంటుంది. క్వాలిఫ‌య‌ర్ 2లో ఆ జ‌ట్టు ఆడ‌నుంది.

ఇక పాయింట్ల ప‌ట్టిక‌లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన గుజ‌రాత్, ముంబై జ‌ట్లు ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. మే 30న చండీగ‌డ్ వేదిక‌గానే ఈ మ్యాచ్ కూడా జ‌ర‌గ‌నుంది. ఇందులో ఓడిపోయిన జ‌ట్టు టోర్నీ నుంచి నిష్ర్క‌మిస్తుంది. గెలిచిన జ‌ట్టు క్వాలిఫ‌య‌ర్‌-2కు చేరుకుంటుంది.

LSG vs RCB : సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడిన జితేశ్‌శ‌ర్మ‌ను మ‌న్క‌డింగ్ చేసే ప్ర‌య‌త్నం.. యువ బౌల‌ర్ పై కోహ్లీ ఆగ్ర‌హం చూశారా? వీడియో..

అహ్మ‌దాబాద్ వేదిక‌గా జూన్ 1న క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో క్వాలిఫ‌య‌ర్‌-1లో ఓడిపోయిన జ‌ట్టు, ఎలిమినేట‌ర్‌లో గెలిచిన జ‌ట్టుతో పోటీప‌డుతుంది. ఇందులో విజ‌యం సాధించిన జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకుంటుంది.

ఐపీఎల్ 2025 సీజ‌న్ ఫైన‌ల్ మ్యాచ్ జూన్ 3న జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో క్వాలిఫ‌య‌ర్‌-1లో విజ‌యం సాధించిన జ‌ట్టు, క్వాలిఫ‌య‌ర్ -2లో గెలుపొందిన జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు ఐపీఎల్ 2025 సీజ‌న్ విజేత‌గా నిల‌వ‌నుంది.

LSG vs RCB : ఆర్‌సీబీ పై ఓట‌మి.. ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇక క్రికెట్ గురించి ఆలోచించ‌ను..

ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ షెడ్యూల్ ఇదే..

మే 29 – క్వాలిఫయర్ 1లో- పంజాబ్ కింగ్స్ వ‌ర్సెస్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
మే 30 – ఎలిమినేటర్‌లో – గుజరాత్ టైటాన్స్ వ‌ర్సెస్‌ ముంబై ఇండియన్స్
జూన్ 1 – క్వాలిఫయర్ 2లో – క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన జట్టు వ‌ర్సెస్‌ ఎలిమినేటర్ విజేత
జూన్ 3 – ఫైన‌ల్ మ్యాచ్ – క్వాలిఫయర్ 1 విజేత వ‌ర్సెస్‌ క్వాలిఫయర్ 2 విజేత