IPL 2025: సన్‌రైజర్స్‌పై ఓడిపోవటం ఆర్సీబీకే మంచిదట.. కెప్టెన్ జితేశ్ శర్మ ఆసక్తికర కామెంట్స్
సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ జితేశ్ శర్మ మాట్లాడారు.

IPL 2025 : బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (RCB) జట్టుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు బిగ్ షాకిచ్చింది. శుక్రవారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా.. 42 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. 232 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 19.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఓటమి తరువాత పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. తాజా ఓటమితో ఆర్సీబీ మూడో స్థానంకు పడిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ తో ఆఖరి మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించినా.. టాప్-2లో నిలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ జితేశ్ శర్మ మాట్లాడారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పేలవ బౌలింగ్, చెత్త షాట్లు తమ జట్టు విజయావకాశాలు దెబ్బతీశాయి. గెలిచే పరిస్థితుల నుంచి ఎలా ఓడిపోయామో అర్ధం కావడం లేదు. మేం బౌలింగ్ లో 20 -30 పరుగులు అదనంగా ఇచ్చాం. అయినా బ్యాటింగ్ లో మెరుగైన ప్రదర్శన చేశాం. కీలక సమయంలో నేను ఔట్ అవ్వడం తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, ఈ మ్యాచ్ లో ఓడిపోవడం మంచిదే. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని మరింత రాటుదేలుతాం. రాబోయే మ్యాచ్ లకు పకడ్భందీగా బరిలోకి దిగుతాం’’ అని జితేశ్ శర్మ చెప్పారు.
Jitesh Sharma said, “it’s good to lose this match, sometimes losing is good, you can check and analyse where you’re lacking”. pic.twitter.com/KmbdY5T3fn
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 23, 2025