IPL 2025: హోం గ్రౌండ్‌లో ఆర్సీబీ అద్భుత విజయం.. విరాట్ కోహ్లీ సంబరాలు అదుర్స్.. వీడియో వైరల్

చివరి రెండు ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోవటంతో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ..

IPL 2025: హోం గ్రౌండ్‌లో ఆర్సీబీ అద్భుత విజయం.. విరాట్ కోహ్లీ సంబరాలు అదుర్స్.. వీడియో వైరల్

Credit BCCI

Updated On : April 25, 2025 / 7:59 AM IST

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.

Also Read: IPL 2025: అయ్యో రాజస్థాన్.. జస్ట్ మిస్.. చివరి రెండు ఓవర్లలో ఫలితాన్ని మార్చేసిన ఆర్సీబీ..

ఆఖరి 12 బంతుల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 18పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. సొంతగడ్డపై బెంగళూరుకు మరో ఓటమి తప్పదని అందరూ భావించారు. కానీ, చివరి రెండు ఓవర్లలో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 19వ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన హేజిల్‌వుడ్‌ మ్యాచ్‌ను బెంగళూరు వైపు తిప్పాడు. ఆ ఓవర్లో జోరుమీదున్న జురెల్‌తో పాటు ఆర్చర్‌ను ఔట్‌ చేసిన అతడు ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రాయల్స్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆఖరి ఓవర్లో యశ్‌ దయాళ్‌సైతం అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ జట్టు ఓడిపోయింది.

Also Read: RCB vs RR : సొంత గడ్డ‌పై ఆర్‌సీబీ తొలి విజ‌యం.. ఎమోష‌న‌ల్ అయిన విరాట్ కోహ్లీ.. ఇప్ప‌టికి అర్థ‌మైంది..

చివరి రెండు ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోవటంతో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో స్టేడియం మొత్తం ఆర్సీబీ నామజపంతో మార్మోగిపోయింది. మ్యాచ్ విజయం తరువాత విరాట్ కోహ్లీ నేరుగా హేజిల్ వుడ్ వద్దకు వెళ్లి అతన్ని అమాంతం ఎత్తుకొని అభినందించారు. ఓడిపోతామనుకున్న మ్యాచ్ లో విజయం సాధించడంతోపాటు.. ఈ ఐపీఎల్ సీజన్ లో సొంతగడ్డపై తొలి విజయం నమోదు చేయడంతో ఆర్సీబీ ప్లేయర్స్ పెద్దెత్తున సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.