IPL 2025: గ్రౌండ్‌లో అభిషేక్ విధ్వంసం.. స్టాండ్స్‌లో రెచ్చిపోయిన కావ్యా పాప.. గంతులే గంతులు.. వీడియో వైరల్
మైదానంలో అభిషేక్ శర్మ, హెడ్ లు బౌండరీల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు స్టాండ్స్ లో ఆ జట్టు యాజమాని కావ్యా మారన్ గంతులేస్తూ..

Abhishek Sharma
IPL 2025: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మైదానంలోకి దిగిన తరువాత ఎలా ఆడుతుందో చెప్పడానికి ఆ జట్టు యాజమాని కావ్యా మారన్ ముఖం చూస్తే తెలిసిపోతుంది. కావ్యా పాప నవ్విందంటే సన్ రైజర్స్ మంచిగా ఆడుతున్నట్లు.. స్టాండ్స్‌లో గంతులేస్తుందంటే జట్టు సూపర్ గా ఆడుతున్నట్లు. ఆమె నిరాశగా కనిపిస్తే సన్ రైజర్స్ జట్టు ఓడిపోతున్నట్లు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఒక్క మ్యాచ్ మినహా.. హైదరాబాద్ జట్టు వరుసగా ఓడిపోతూ వస్తోంది. దీంతో స్టాండ్స్ లో కావ్యా పాప సంబురాలు కనిపించక ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ కూడా నిరాశ పడుతున్నారు. కానీ, శనివారం రాత్రి ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ బ్యాటుతో విధ్వంసం సృష్టించడంతో కావ్యా మారన్ స్టాండ్స్ లో సంబరాలు చేసుకుంది.
Also Read: IPL 2025: చిట్టీ రాసుకొచ్చి మరీ చితకబాదిన అభిషేక్ శర్మ.. ఆ కాగితంలో ఏముందంటే..? వీడియో వైరల్
ఉప్పల్ స్టేడియంలో శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్ వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. పంజాబ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా.. 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ ను ఆడుతూపాడుతూ కొట్టేసింది. ఆ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రారంభం నుంచి బౌండరీల వర్షం కురిపించాడు. ఫలితంగా 55బంతుల్లో 141 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు, 10 సిక్సులు ఉండటం గమనార్హం. బౌలర్ ఎవరైనా బంతిని బౌండరీకి తరలించడమే అన్నట్లుగా బాటుతో వీరవిహారం చేశాడు.
ఒకపక్క మైదానంలో అభిషేక్ శర్మ, హెడ్ (66)లు బౌండరీల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు స్టాండ్స్ లో ఆ జట్టు యాజమాని కావ్యా పాప గంతులేస్తూ సంబురాలు చేసుకుంది. అభిషేక్ శర్మ సెంచరీ చేసిన సమయంలో స్టాండ్స్ లో కావ్యా పాప సంబరాలు అంబరాన్నంటాయనే చెప్పొచ్చు. పక్కనే ఉన్న అభిషేక్ శర్మ తల్లిదండ్రులకు హత్తుకొని అభినందనలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Kavya Maran congratulating Abhishek Sharma’s family. 🥹
– Moment of the day! ❤️pic.twitter.com/BqlelGoXdu
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 12, 2025