IPL 2025: చిట్టీ రాసుకొచ్చి మరీ చితకబాదిన అభిషేక్ శర్మ.. ఆ కాగితంలో ఏముందంటే..? వీడియో వైరల్

ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు.

IPL 2025: చిట్టీ రాసుకొచ్చి మరీ చితకబాదిన అభిషేక్ శర్మ.. ఆ కాగితంలో ఏముందంటే..? వీడియో వైరల్

Abhishek Sharma

Updated On : April 13, 2025 / 7:22 AM IST

IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రాత్రి ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ విధ్వంసంతో పంజాబ్ జట్టు చేసిన భారీ స్కోర్ తేలిపోయింది. గాలి దుమారం విధ్వంసం సృష్టినట్లు.. అభిషేక్ శర్మ మైదానంలోకి వచ్చి బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు. పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఎంత మంది బౌలర్లతో మార్చిమార్చి బౌలింగ్ చేయించినా అభిషేక్ శర్మ బాదుడును అడ్డుకోలేక పోయారు.

Also Read: IPL 2025: పంజాబ్ పరుగుల సునామీ.. హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా వరుస ఓటములతో సతమతమవుతున్న సన్ రైజర్స్ జట్టు ఓటమి ఖాయమని అందరూ అంచనా వేశారు. కానీ, అభిషేక్ శర్మ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విధ్వంసం సృష్టించాడు. కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేశాడు. అందులో 10 సిక్సులు, 14 ఫోర్లు ఉండటం విశేషం.

Also Read: Gt Vs LSG: ధనాధనా హాఫ్ సెంచరీలు బాదిన గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్లు

సెంచరీ పూర్తి చేసిన తరువాత అభిషేక్ శర్మ వినూత్న రీతిలో సంబురాలు చేశాడు. తన జేబులో నుంచి ఒక కాగితం తీసి.. చుట్టూ తిరుగుతూ ఆ కాగితాన్ని స్టాండ్స్ వైపు చూపించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఆ కాగితంలో ఏం రాశాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ‘‘ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం’’ అని అందులో రాసి ఉంది. అంటే వరుస ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న అభిమానులకు ఈ మ్యాచ్ గెలిచి కానుకగా ఇవ్వాలన్న కృతనిశ్చయంతోనే అభిషేక్ బ్యాటింగ్ కు వెళ్లాడని అర్ధమవుతుంది. అభిషేక్ సెంచరీ చేసిన తరువాత జేబులో నుంచి చిట్టీ తీసి చూపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ‘‘చిట్టీ పట్టుకెళ్లి మరీ విధ్వంసం సృష్టించాడు.. వీడు మగాడ్రా బుజ్జీ’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.