IPL 2025: ఐపీఎల్ 2025 విన్నర్ గా ఆర్సీబీ.. విరాట్ కోహ్లి కీలక వ్యాఖ్యలు..

మూడుసార్లు ఆఖ‌రి మెట్టుమీద త‌డ‌బ‌డిన ఆర్సీబీ.. ఎట్టకేల‌కు తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.

IPL 2025: ఐపీఎల్ 2025 విన్నర్ గా ఆర్సీబీ.. విరాట్ కోహ్లి కీలక వ్యాఖ్యలు..

Courtesy BCCI @IPL @mufaddal_vohra

Updated On : June 4, 2025 / 12:11 AM IST

IPL 2025: IPL 2025: ఎట్టకేలకు ఆర్సీబీ కల నెరవేరింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ విజేతగా నిలిచింది. తొలి ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విక్టరీ కొట్టింది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ లో ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. పంజాబ్ తో హోరాహోరీ పోరులో విజయం సాధించి సుదీర్ఘ ఐపీఎల్ టైటిల్ నిరీక్షణకు తెరదించింది. 18వ సీజన్‌ లో ఎట్టకేలకు తమ తొలి ఐపీఎల్ టైటిల్ ని అందుకుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి టైటిల్ కోసం అలుపెరగని పోరాటం చేసింది ఆర్సీబీ. చివరికి లక్ష్యాన్ని సాధించింది. ఫైనల్ లో సమష్టి ప్రదర్శనతో విక్టరీ కొట్టి.. 17 సీజన్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీని 18వ ప్రయత్నంలో సొంతం చేసుకుంది. మూడుసార్లు ఆఖ‌రి మెట్టుమీద త‌డ‌బ‌డిన ఆర్సీబీ.. ఎట్టకేల‌కు తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. 18ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీకి ఇదే తొలి టైటిల్. ఆర్సీబీ గెలుపుతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మ్యాచ్ తర్వాత ఆర్బీసీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాట్లాడాడు. కీలక వ్యాఖ్యలు చేశాడు. నేను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడాలని అనుకోవడం లేదన్నాడు విరాట్ కోహ్లి. ఫీల్డ్ లోకి దిగి ఇంపాక్ట్ చూపించాలన్నదే తన లక్ష్యం అని తెలిపాడు.

కాగా, ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లి బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఒక సమయంలో ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. గ్రౌండ్ లోనే కంటతడి పెట్టాడు.