IPL 2026: తిరుగులేని రాజస్తాన్.. హ్యాట్రిక్ విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
IPL 2026: ఈ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. రాజస్తాన్ మంచి ఫామ్ లో ఉంది. ఈ సీజన్ లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ అదరగొట్టింది. ముంబైపై గెలుపొందింది. 27 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. 154 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై 9 వికెట్ల నష్టానికి 123 పరుగులే చేసింది. ఈ సీజన్ లో రాజస్తాన్ కు ఇది వరుసగా మూడో విజయం కాగా ముంబైకి వరుసగా రెండో పరాజయం. వరుస విజయాలతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది.
