IPL 2026 : ఐపీఎల్ రిటెన్షన్‌ జాబితా విడుదల.. తెలుగు ప్లేయర్లు ఎవరు ఏ జట్టులో ఉన్నారు… ఫుల్ డీటెయిల్స్

IPL 2026 : ఐపీఎల్ - 2026లో భాగంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ప్రక్రియ ముగిసింది. ఐపీఎల్ 2026 వేలానికి ముందు ..

IPL 2026 : ఐపీఎల్ రిటెన్షన్‌ జాబితా విడుదల.. తెలుగు ప్లేయర్లు ఎవరు ఏ జట్టులో ఉన్నారు… ఫుల్ డీటెయిల్స్

IPL 2026 Retention

Updated On : November 16, 2025 / 12:25 PM IST

IPL 2026 : ఐపీఎల్ – 2026లో భాగంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ప్రక్రియ ముగిసింది. ఐపీఎల్ 2026 వేలానికి ముందు రిటైన్ చేసుకునే, విడుద‌ల చేసే ఆట‌గాళ్ల జాబితాల‌ను అన్ని ఫ్రాంఛైజీలు ప్ర‌క‌టించాయి. తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న యాజమాన్యాలు.. భారం అనుకున్న ప్లేయర్లను వదిలించుకున్నాయి. డిసెంబరు 15న అబుదాబి వేదిక‌గా మినీ వేలం జరగనుంది. (IPL 2026 Retention)

ఐపీఎల్ టోర్నీలో తెలుగు ఆటగాళ్లు కూడా ఆయా జట్ల విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. అయితే, ఐపీఎల్ 2026 సీజన్ కు సిద్ధమవుతున్న వేళ ఆయా జట్ల యాజమాన్యాలు తమకు అవసరం లేని ప్లేయర్లను వదిలేశాయి. ఈ జాబితాలో తెలుగు ప్లేయర్లలో ఒకరు మాత్రమే ఉన్నారు.

Also Read: IPL 2026 : ఐపీఎల్ 2026.. ఏ ఫ్రాంఛైజీ ఖాతాలో ఎంత సొమ్ము ఉంది.. ఎంత మంది ప్లేయర్లను కొనుగోలు చేయొచ్చు.. ఫుల్ డీటెయిల్స్

ఐపీఎల్ లో ఆడుతున్న వారిలో తిలక్ వర్మ (ముంబై ఇండియన్స్), నితీష్ రెడ్డి (సన్ రైజర్స్ హైదరాబాద్), త్రిపురాన విజయ్ (ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్), పైలా అవినాష్ (పంజాబ్ కింగ్స్), మహమ్మద్ సిరాజ్ (గుజరాత్ టైటాన్స్), సత్యనారాయణ రాజు (ముంబై ఇండియన్స్)లలో ఆడుతున్నారు. అయితే, శనివారం ఐపీఎల్ ఫ్రాంచైజీలై ఆట‌గాళ్ల జాబితాల‌ను ప్రకటించాయి. తిలక్ వర్మను ముంబై జట్టు అంటిపెట్టుకొని ఉంది. నితీశ్ రెడ్డి, త్రిపురాన విజయ్, పైలా అవినాశ్, మహమ్మద్ సిరాజ్‌లను ఆయా జట్ల యాజమాన్యాలు తమ వద్ద అంటిపెట్టుకొని ఉన్నాయి.

అయితే, సత్యనారాయణ రాజును మాత్రం ముబై ఇండియన్స్ వదిలేసింది. ప్రస్తుతం అతను ఐపీఎల్ వేలంలోకి వెళ్లనున్నారు. డిసెంబర్ 15వ తేదీన అబుదాబి వేదికగా మినీ వేలం జరగనుంది. ఈ వేలంలో ఏదైనా జట్టు యాజమాన్యం సత్యనారాయణ రాజును కొనుగోలు చేస్తే ఆ జట్టులోకి వెళ్లాల్సి ఉంటుంది.