IPL కెప్టెన్లుగా ఫెయిలైన భారత కెప్టెన్లు

ఐపీఎల్ 2019 ఆరంభమైనప్పటి నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్‌లోనూ విజయం దక్కించుకోలేదు. ఇలా కోహ్లీ ఒక్కడే కాదు.

IPL కెప్టెన్లుగా ఫెయిలైన భారత కెప్టెన్లు

Updated On : April 9, 2019 / 1:09 PM IST

ఐపీఎల్ 2019 ఆరంభమైనప్పటి నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్‌లోనూ విజయం దక్కించుకోలేదు. ఇలా కోహ్లీ ఒక్కడే కాదు.

ఐపీఎల్ 2019 ఆరంభమైనప్పటి నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్‌లోనూ విజయం దక్కించుకోలేదు. ఇలా కోహ్లీ ఒక్కడే కాదు. టీమిండియా కెప్టెన్సీ వహించి ఐపీఎల్ లో ఫెయిలైన దిగ్గజాలు మరి కొందరున్నారు.

సౌరవ్ గంగూలీ:

భారత క్రికెట్ను చీకట్లో నుంచి దశదిశలా వెలుగొందేలా చేసిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. జాతీయ జట్టుకు టెస్టు, వన్డేల్లో కలిపి 200 సార్లకు పైగా కెప్టెన్సీ వహించాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో కోల్‌కతా కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు. 2 సీజన్లు ఆడి కనీసం ప్లే ఆఫ్ కు కూడా అర్హత దక్కించుకోలేదు. ఆ తర్వాత ఆడిన సీజన్లలో మరింత దారుణంగా ఫెయిలైయ్యాడు. 
Read Also : ఆ కారణంతోనే మేం ఓడిపోతున్నాం: డివిలియర్స్

రాహుల్ ద్రవిడ్:

అంతర్జాతీయ క్రికెట్లో రాహుల్ ద్రవిడ్ కు ఓ అరుదైన గౌరవం ఉంది. భారత క్రికెట్ కు అందిస్తున్న సేవలు ద్రవిడ్ స్థాయిని పెంచాయి. టీమిండియా కెప్టెన్ గా కూడా టెస్టులు, వన్డేలు కలిపి 104 అంతర్జాతీయ మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ వహించి లీగ్ పట్టికలో ఏడో స్థానంలో  ఉండే సీజన్ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా 2010లో బెంగళూరు ద్రవిడ్ ను జట్టు నుంచి తొలగించింది. 

వీరేంద్ర సెహ్వాగ్:

నవాబ్ ఆఫ్ నజఫ్ఘర్ వీరేంద్ర సెహ్వాగ్. టీమిండియా ఓపెనర్ గానే కాకుండా కెప్టెన్ గానూ మంచి ట్రాక్ రికార్డు ఉన్న ప్లేయర్. ఐపీఎల్ 2008 సీజన్ లో ఢిల్లీకి కెప్టెన్సీ వహించి ప్లే ఆఫ్ వరకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆడిన సీజన్లలో మరింత వైఫల్యం వెంటాడింది. 2010 లో కెప్టెన్ గా తొలగించారు. 

విరాట్ కోహ్లీ:

టీమిండియా ప్రస్తుత కెప్టెన్.. అంతర్జాతీయ క్రికెట్లో మేటి బ్యాట్స్‌మన్. 2013లో డేనియల్ వెట్టోరి జట్టును విజయ పథంలో నడపడంలో ఫెయిలవుతున్నందుకు కెప్టెన్ గా తొలగించారు. ఆ తర్వాత ఆర్డర్లో ఉన్న కోహ్లీనే కెప్టెన్సీ వరించినది. 7 సీజన్లుగా సారథ్యం వహిస్తున్నా ప్లే ఆఫ్ కు వెళ్లింది మాత్రం 2 సార్లే. 

అజింకా రహానె:

ముంబై ఇండియన్స్ లో కెరీర్ మొదలుపెట్టినప్పటికీ 2011లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మారాడు. కోహ్లీ గైర్హాజరీలో టీమిండియాను 2017లో ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఛాంపియన్ గా నిలిపాడు. ఇలా 7 మ్యాచ్‌లలో ఆరింటిలో విజయం తెచ్చి పెట్టాడు. కానీ కొద్ది సీజన్లుగా ఐపీఎల్ లో మాత్రం సత్తా నిరూపించుకోలేక బాధపడుతున్నాడు.
Read Also : సూపర్ కింగ్స్ చేతికి అడ్డంగా దొరికిన జడేజా