IPL2022 DC Vs CSK : కీలక పోరులో ఢిల్లీకి షాక్.. చెన్నై ఘన విజయం
చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఢిల్లీపై సూపర్ విక్టరీ కొట్టింది. చెన్నై నిర్దేశించిన 209 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు..(IPL2022 DC Vs CSK)

chennai super kings
IPL2022 DC Vs CSK : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఫామ్‌లో ఉన్న ఢిల్లీని చిత్తు చేసింది. 91 పరుగుల తేడాతో ఢిల్లీపై చెన్నై సూపర్ విక్టరీ కొట్టింది. చెన్నై నిర్దేశించిన 209 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.4 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్(25), కెప్టెన్ రిషబ్ పంత్ (21), శార్దూల్ ఠాకూర్ (24), డేవిడ్ వార్నర్ (19) పరుగులు చేశారు. వీరు తప్పితే ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదు.(IPL2022 DC Vs CSK)
చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ మూడు వికెట్లు పడగొట్టాడు. డ్వేన్ బ్రావో, సిమర్ జీత్ సింగ్, ముకేశ్ చౌదరి తలో రెండు వికెట్లు తీశారు. మహీశా తీక్షణ ఒక వికెట్ తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది.(IPL2022 DC Vs CSK)
Chris Gayle: “నాకు గౌరవం దక్కలేదు.. అలా జరగాల్సిందే”
కీలకమైన మ్యాచ్‌లో ఢిల్లీ ఘోరంగా విఫలమైంది. తాజా ఓటమితో ఢిల్లీ నెట్ రన్‌రేట్ భారీగా పడిపోయింది. ఢిల్లీ (10) తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు అద్భుత విజయం సాధించిన చెన్నై (8) పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది.

IPL2022 DC Vs CSK Chennai Super Kings Won On Delhi Capitals By Runs
ఈ మ్యాచ్ లో చెన్నై బ్యాటర్లు చెలరేగారు. చెన్నై ఓపెనర్లు డేవన్ కాన్వే (87), రుతురాజ్ గైక్వాడ్ (41) ధాటిగా ఆడారు. డేవన్ కాన్వే 49 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. శివమ్ దూబే (32), ఎంఎస్ ధోనీ (21*) దూకుడుగా ఆడారు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.(IPL2022 DC Vs CSK)
డెవాన్ కాన్వేతో పాటు మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సైతం ధాటిగా ఆడాడు. గైక్వాడ్ 33 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 41 పరుగులు చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన యువ ఆటగాడు శివమ్ దూబే మరింత దూకుడుగా ఆడి 19 బంతుల్లోనే 32 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 2 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. చివర్లో వచ్చిన కెప్టెన్ ధోనీ సైతం బ్యాట్ ఝుళిపించడంతో చెన్నై స్కోరు 200 దాటింది. ధోనీ 8 బంతుల్లోనే 1 ఫోర్, 2 సిక్సులతో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
Virat Kohli: ఐపీఎల్ 2022లో మూడోసారి గోల్డెన్ డక్‌గా విరాట్
ఆరంభ ఓవర్లలో ఆచితూచి ఆడిన ఓపెనర్లు… తర్వాత వేగంగా పరుగులు సాధించారు. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లను తీయడంతో చెన్నై ఇంకా ఎక్కువ పరుగులు చేయకుండా ఢిల్లీ బౌలర్లు అడ్డుకోగలిగారు. ఢిల్లీ బౌలర్లలో ఆన్రిచ్ నోర్జే మూడు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ 2 వికెట్లు తీశాడు. మిచెల్ మార్ష్ ఒక వికెట్ తీశాడు.
జట్ల వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డేవన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మొయిన్ అలీ, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, డ్వేన్ బ్రావో, మహీషా తీక్షణ, సిమర్‌జీత్ సింగ్, ముకేశ్ చౌదరి
ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జే.(IPL2022 DC Vs CSK)
Yellow all the way ??
A comprehensive 91-run win for Chennai Super Kings over Delhi Capitals – WHAT A WIN! #TATAIPL #CSKvDC #IPL2022 pic.twitter.com/O7yTOV0FnQ
— IndianPremierLeague (@IPL) May 8, 2022