IPL2022 RCB Vs KKR : బెంగళూరు బోణీ.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై విజయం

టార్గెట్ చిన్నదే అయినా బెంగళూరు చెమటోడ్చాల్సి వచ్చింది. చివరకు మూడు వికెట్ల తేడాతో కోల్ కతాను చిత్తు చేసింది.

IPL2022 RCB Vs KKR : బెంగళూరు బోణీ.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై విజయం

Ipl2022 Rcb Vs Kkr

Updated On : March 30, 2022 / 11:59 PM IST

IPL2022 RCB Vs KKR : ఐపీఎల్ 2022 సీజన్ 15 లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో బెంగళూరు జట్టు విజయం సాధించింది. టార్గెట్ చిన్నదే అయినా బెంగళూరు చెమటోడ్చాల్సి వచ్చింది. చివరకు మూడు వికెట్ల తేడాతో కోల్ కతాను చిత్తు చేసింది. కోల్ కతా చివరి వరకు పోరాడినా పరాజయం తప్పలేదు. కోల్ కతా నిర్దేశించిన 129 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరు.. మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. 19.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి విక్టరీ కొట్టింది.

స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన బెంగళూరు బ్యాటర్లు నెమ్మదిగా ఆడారు. బెంగళూరు బ్యాటర్లలో రూథర్‌ఫర్డ్‌, షాబాద్ అహ్మద్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. రూథర్ ఫర్డ్ (40 బంతుల్లో 28 పరుగులు) టాప్ స్కోరర్. షాబాజ్‌ అహ్మద్ ‌(20 బంతుల్లో 27 పరుగులు), దినేష్ కార్తిక్(7 బంతుల్లో 14 పరుగులు*), హర్షల్ పటేల్(6 బంతుల్లో 10 పరుగులు*) ధాటిగా ఆడారు. డేవిడ్ విల్లే(18), విరాట్ కోహ్లి(12) పరుగలు చేశారు. కెప్టెన్ డు ప్లెసిస్(5) విఫలం అయ్యాడు. కోల్ కతా బౌలర్లలో టిమ్ సౌథీ మూడు వికెట్లు తీశాడు. ఉమేష్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.(IPL2022 RCB Vs KKR)

Chris Gayle : టీ20 లెజెండ్ క్రిస్ గేల్.. విల్ బి బ్యాక్.. ఐపీఎల్‌లో రీఎంట్రీ..!

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌క‌తాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. బెంగ‌ళూరు బౌలర్లు అదరగొట్టారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ప‌వ‌ర్ ప్లే ముగిసేస‌రికి కోల్‌క‌తా మూడు వికెట్లు కోల్పోయింది. వెంక‌టేశ్ అయ్య‌ర్ (10), అజింక్యా ర‌హానె (9), నితీశ్ రాణా (10) ప‌రుగుల వేట‌లో విఫ‌ల‌మ‌య్యారు. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (13), సునీల్ న‌రైన్ (12), షెల్డ‌న్ జాక్స‌న్‌(0) స‌హా ఎవ్వ‌రూ ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు. ఆండ్రూ ర‌స్సెల్ (25) ఒక్క‌డే అంద‌రిలో కాస్త మెరుగ్గా ఆడాడు. మిగిలిన వారంతా ఘోరంగా విఫ‌లం కావ‌డంతో పూర్తి స్థాయి ఓవ‌ర్లు ఆడ‌కుండానే 18.5 ఓవ‌ర్లలోనే కోల్ క‌తా త‌న ఇన్నింగ్స్‌ను 128 ప‌రుగుల‌కే ముగించేసింది. ఆ త‌ర్వాత స్వ‌ల్ప టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన బెంగ‌ళూరు 19.2 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని చేధించింది.

టాస్ గెలిచిన బెంగళూరు జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుని కోల్ క‌తాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బంతితో రెచ్చిపోయిన బెంగ‌ళూరు బౌల‌ర్లు కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌ను ఏమాత్రం కుదురుకోనీయ‌కుండా ప‌క‌డ్బందీగా బౌలింగ్ చేశారు. ఈ క్ర‌మంలో కోల్ క‌తా త‌ర‌ఫున ఒక్క‌రు కూడా క్రీజులో కుదురుకోలేక‌పోయారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో వనిందు హ‌స‌రంగా ఏకంగా 4 వికెట్లు తీసుకోగా.. ఆకాశ్ దీప్ 3 వికెట్లు, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌ 2 వికెట్లు తీసుకున్నారు. మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు.

ఐపీఎల్ 15వ సీజన్ శనివారం (మార్చి 26, 2022) నుంచి ప్రారంభమైంది. గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తొలి పోరులో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా విజయం సాధించింది. ఈసారి ఐపీఎల్ పోటీలు ముంబై, పుణె నగరాల్లోనే నిర్వహిస్తున్నారు.(IPL2022 RCB Vs KKR)

IPL 2022: టీమిండియాకు ఆడదగ్గ ప్లేయర్ అంటూ రవిశాస్త్రి కామెంట్లు

ఈసారి ఐపీఎల్ లో అహ్మదాబాద్ (గుజరాత్ టైటాన్స్), లక్నో (లక్నో సూపర్ జెయింట్స్) జట్లు కూడా ఆడుతుండగా, ఫ్రాంచైజీల సంఖ్య 10కి పెరిగింది. గుజరాత్ జట్టుకు హర్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తుండగా, లక్నో జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్లన్నింటికీ ముంబైలోని వివిధ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అయితే, ముంబైలో క్రికెట్ మైదానాలకు, ఆటగాళ్లు బస చేస్తున్న హోటళ్లు చాలా దూరంలో ఉన్నాయి. దాంతో, ఆటగాళ్లను మైదానానికి తరలించేందుకు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేశారు.