IPL2022 SRH Vs GT : గుజరాత్ జైత్రయాత్రకు హైదరాబాద్ బ్రేక్.. సీజన్లో తొలి ఓటమి..
ఈ సీజన్లో కొత్తగా అడుగు పెట్టి ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలుపొంది జోరుమీదున్న గుజరాత్ జట్టుకి హైదరాబాద్ షాక్ ఇచ్చింది.

Ipl2022 Srh Vs Gt
IPL2022 SRH Vs GT : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ సీజన్లో కొత్తగా అడుగు పెట్టి ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలుపొంది జోరుమీదున్న గుజరాత్ జట్టుకి హైదరాబాద్ షాక్ ఇచ్చింది. గుజరాత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ సీజన్ లో తొలి ఓటమిని చవి చూసింది గుజరాత్ టైటాన్స్. 163 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ 19.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 8 వికెట్ల తేడాతో గుజరాత్ పై గెలుపొందింది.
ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేసినా.. బ్యాటింగ్‌లో హైదరాబాద్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు 19.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.(IPL2022 GT Vs SRH)
IPL 2022: ఐపీఎల్లో ప్రత్యేక ఘనత సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్
హైదరాబాద్ బ్యాటర్లలో కెప్టెన్ కేన్ విలియమ్ సన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 46 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 2 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడాడు. 32 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. నికోలస్ వూరన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లో 38 పరుగులు(నాటౌట్) చేశాడు. 2 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. మార్ క్రమ్ 8 బంతుల్లో 12 పరుగులు(నాటౌట్) చేశాడు. రాహుల్ త్రిపాఠి (17) రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. గుజరాత్ బౌలర్లలో హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
Nicholas Pooran hits the winnings runs as @SunRisers win by 8 wickets against #GujaratTitans
Scorecard – https://t.co/phXicAbLCE #SRHvGT #TATAIPL pic.twitter.com/F5o01VSEHv
— IndianPremierLeague (@IPL) April 11, 2022
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్… భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచిన గుజరాత్ టైటాన్స్ ను సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా నియంత్రించారు. ఫీల్డర్లు వరుసగా క్యాచ్ లు వదిలినప్పటికీ బౌలర్లు సరైన ప్రదేశాల్లో బంతులు సంధిస్తూ, గుజరాత్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.
IPL2022 RR Vs LSG : లక్నో జైత్రయాత్రకు బ్రేక్.. ఉత్కంఠపోరులో రాజస్తాన్ గెలుపు
గుజరాత్ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 42 బంతుల్లో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, నటరాజన్ 2, మార్కో జాన్సెన్ 1, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ తీశారు.
Our Top Performer from the second innings is Kane Williamson for his excellent knock of 57.
A look at his batting summary here ?? #TATAIPL #SRHvGT pic.twitter.com/YCra3oCkQl
— IndianPremierLeague (@IPL) April 11, 2022
తుది జట్ల వివరాలు..
హైదరాబాద్ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠీ, మార్క్రమ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
గుజరాత్ : శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమి, దర్శన్ నల్కండే