Jay Shah : టీమ్ఇండియా కీలక ఆటగాళ్లు షమీ, పంత్, కేఎల్ రాహుల్ రీ ఎంట్రీపై జైషా
రిషబ్ పంత్, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్ ల రీ ఎంట్రీలపై జైషా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Jay Shah leaves the door open for Rishabh Pant’s selection in T20 World Cup 2024
Jay Shah – Rishabh Pant : గత కొంతకాలంగా టీమ్ఇండియా స్టార్ క్రికెటర్లు గాయాలతో సావాసం చేస్తున్న సంగతి తెలిసిందే. రిషబ్ పంత్, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్ లు కొన్నాళ్లుగా మ్యాచ్‌లు ఆడడం లేదు. వీరి రీ ఎంట్రి గురించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జై షా కీలక అప్‌డేట్ లు ఇచ్చారు. టీ20 ప్రపంచకప్‌కు మహ్మద్ షమీ దూరం కానున్నాడని, అదే సమయంలో రిషబ్ పంత్ ఈ మెగాటోర్నీలో ఆడే అవకాశాలు ఉన్నట్లు చెప్పాడు.
వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ తరువాత మరో మ్యాచ్ ఆడలేదు మహ్మద్ షమీ. చీలమండల గాయంతో బాధపడుతున్న షమీ ఇటీవల లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతడి సర్జరీ విజయవంతమైంది. కాగా.. షమీ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని జై షా తెలిపారు. జై షా చెప్పిన దాన్ని బట్టి చూస్తే షమీ టీ20 ప్రపంచకప్ ఆడడని అర్థమవుతోంది.
WPL 2024 : మైదానంలో కన్నీటి పర్యంతమైన ఆర్‌సీబీ ప్లేయర్.. ప్రత్యర్థి ప్లేయర్లు వచ్చి
పంత్ వస్తానంటే..?
డిసెంబర్ 30, 2022లో రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో 15 నెలలుగా అతడు ఆటకు దూరంగా ఉన్నాడు. కాగా.. ప్రస్తుతం పంత్ పూర్తిగా కోలుకున్నాడని, అతడు ఐపీఎల్ ఆడనున్నట్లు జైషా తెలిపారు. పంత్ మునపటిలా బ్యాటింగ్ చేస్తున్నాడని, త్వరలోనే అతడికి ఎన్ఓసీ ఇవ్వనున్నట్లు చెప్పారు. అతడు టీ20 ప్రపంచకప్ ఆడాలని అనుకుంటే అతడి పేరును ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామన్నాడు.
కేఎల్ రాహుల్ సంగతేంటంటే..?
ఇంగ్లాండ్‌తో మొదటి టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. దీంతో చివరి నాలుగు టెస్టు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ఇటీవల యూకేకు వెళ్లి తన గాయంపై అక్కడి వైద్యులను సంప్రదించాడు. అంతాబాగానే ఉందని అక్కడి వైద్యులు తెలపడంతో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రిహాబిటేషన్‌ను పొందుతున్నాడు. ఐపీఎల్ ఆరంభం నాటికి అతడు ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉందని జైషా అన్నారు.