Joe Root : పాకిస్థాన్‌తో తొలి టెస్టు.. జోరూట్ రికార్డులే రికార్డులు

ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జో రూట్ గ‌త కొన్నాళ్లుగా భీక‌ర ఫామ్‌లో ఉన్నాడు.

Joe Root : పాకిస్థాన్‌తో తొలి టెస్టు.. జోరూట్ రికార్డులే రికార్డులు

Joe Root becomes Englands all time leading run scorer in Tests

Updated On : October 9, 2024 / 4:21 PM IST

Joe Root : ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జో రూట్ గ‌త కొన్నాళ్లుగా భీక‌ర ఫామ్‌లో ఉన్నాడు. పాకిస్థాన్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచులో ప‌లు రికార్డుల‌ను న‌మోదు చేశాడు. ఇంగ్లాండ్ త‌రుపున టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. గ‌తంలో ఈ రికార్డు అలిస్ట‌ర్ కుక్ పేరిట ఉండేది.

అలిస్ట‌ర్ కుక్ 161 టెస్టుల్లో 45.35 స‌గ‌టుతో 12472 ప‌రుగులు చేశాడు. రూట్ కేవ‌లం 147 టెస్టుల్లోనే దీన్ని అందుకున్నాడు. ముల్తాన్‌లో పాకిస్థాన్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 71 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద రూట్.. కుక్ రికార్డును బ్రేక్ చేశాడు. రూట్ స‌గ‌టు 50ఫ్ల‌స్‌గా ఉంది.

Rohit Sharma : ముంబైలోని బిజీ రోడ్డు పై.. రోహిత్ చేసిన ప‌నికి ఫిదా.. కారు ఆపి..

అంతే కాదండోయ్ టెస్టు క్రికెట్‌లో ఓవ‌రాల్‌గా అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్ల‌లో స‌చిన్ టెండూల్క‌ర్ 15,921 ప‌రుగుల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత రికీ పాంటింగ్‌, జాక్వెస్ క‌లిస్‌, రాహుల్ ద్ర‌విడ్ లు ఉన్నారు.

టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్లు వీరే..

సచిన్ టెండూల్కర్ (భార‌త్‌) – 15921 ప‌రుగులు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 13378 ప‌రుగులు,
జాక్వస్ కలిస్ (ద‌క్షిణాఫ్రిక‌) – 13289 ప‌రుగులు
రాహుల్ ద్రవిడ్ (భార‌త్‌) – 13288 ప‌రుగులు
జో రూట్ (ఇంగ్లాండ్‌) – 12473* ప‌రుగులు

IND vs BAN : భార‌త్‌తో రెండో టీ20 మ్యాచ్‌.. రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన బంగ్లాదేశ్ సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్

35వ శ‌త‌కం..

ఈ మ్యాచ్‌లో రూట్ శ‌త‌కం బాదాడు. టెస్టుల్లో ఇది అత‌డికి 35వ‌ది. ఈ క్ర‌మంలో టెస్టుల్లో అత్య‌ధిక సెంచ‌రీలు బాదిన ఆట‌గాళ్ల జాబితాలో ఆరో స్థానానికి రూట్ చేరుకున్నాడు. సునీల్‌ గవాస్కర్‌, బ్రియాన్‌ లారా, మహేళ జయవర్దనే, యూనిస్‌ ఖాన్‌ లాంటి దిగ్గజాలను అధిగమించాడు. వీరంతా టెస్టుల్లో 34 శ‌త‌కాలు చేశారు.

టెస్ట్‌ల్లో అత్యధిక శ‌త‌కాలు చేసిన ఆట‌గాళ్లు..

సచిన్ టెండూల్క‌ర్ (భార‌త్‌) – 51 సెంచ‌రీలు
జాక్వ‌స్ కలిస్ (ద‌క్షిణాఫ్రికా) – 45 సెంచ‌రీలు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 41 సెంచ‌రీలు
కుమార సంగక్కర (శ్రీలంక‌) – 38 సెంచ‌రీలు
రాహుల్ ద్రవిడ్ (భార‌త్) – 36 సెంచ‌రీలు
జో రూట్ (ఇంగ్లాండ్) – 35* సెంచ‌రీలు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే పాకిస్థాన్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 556 ప‌రుగులు చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 78 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 382 ప‌రుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (78), జో రూట్ (132) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లాండ్ ఇంకా 174 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.