Rohit Sharma : ముంబైలోని బిజీ రోడ్డు పై.. రోహిత్ చేసిన ప‌నికి ఫిదా.. కారు ఆపి..

టీ20ల‌కు వీడ్కోలు చెప్పిన రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.

Rohit Sharma : ముంబైలోని బిజీ రోడ్డు పై.. రోహిత్ చేసిన ప‌నికి ఫిదా.. కారు ఆపి..

Rohit Sharma stops car on busy road, wishes female fan on her birthday

Updated On : October 9, 2024 / 3:15 PM IST

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను టీమ్ఇండియా 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. భార‌త జ‌ట్టు ప్ర‌స్తుతం మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతోంది. అయితే.. టీ20ల‌కు వీడ్కోలు చెప్పిన రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. త‌నకు ఎంతో ఇష్ట‌మైన లంబొర్గిని కారులో ముంబై వీధుల్లో తిరుగుతున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు మ‌రోసారి త‌న మంచి మ‌న‌సును చాటుకున్నాడు.

ముంబైలో ఓ సిగ్నల్ వ‌ద్ద రోహిత్ ఆగాడు. ఈ క్ర‌మంలో ఓ మ‌హిళా అభిమాని అత‌డి కారు వ‌ద్ద‌కు ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చింది. సెల్ఫీ అడ‌గ‌డంతో రోహిత్ ఆమెకు సెల్ఫీ ఇచ్చాడు. త‌న పుట్టిన రోజు అని చెప్ప‌గా.. షేక్ హ్యాండ్ ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. దీంతో ఆ మ‌హిళా అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Womens T20 World Cup 2024 : శ్రీలంక‌తో భార‌త్ ఢీ.. ఓడితే టీమ్ఇండియా పరిస్థితేంటి? సెమీస్‌ ఛాన్స్ ఉందా?

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రోహిత్ ది మంచి మ‌న‌సు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అక్టోబ‌ర్ 16 నుంచి భార‌త జ‌ట్టు న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. తొలి టెస్టు మ్యాచ్ బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఈ సిరీస్ కోసం రోహిత్ ప్రాక్టీస్ మొద‌లు పెట్టాడు. ముంబైలోని జియో పార్క్ స్టేడియంలో త‌న స‌న్న‌హాకాల‌ను ప్రారంభించాడు. ఈ క్ర‌మంలో మైదానానికి వెలుతుండ‌గా ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.

IND vs BAN : భార‌త్‌తో రెండో టీ20 మ్యాచ్‌.. రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన బంగ్లాదేశ్ సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్