Womens T20 World Cup 2024 : శ్రీలంక‌తో భార‌త్ ఢీ.. ఓడితే టీమ్ఇండియా పరిస్థితేంటి? సెమీస్‌ ఛాన్స్ ఉందా?

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో మ్యాచులు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి.

Womens T20 World Cup 2024 : శ్రీలంక‌తో భార‌త్ ఢీ.. ఓడితే టీమ్ఇండియా పరిస్థితేంటి? సెమీస్‌ ఛాన్స్ ఉందా?

What Happens if India lose to SriLanka today

Updated On : October 9, 2024 / 11:25 AM IST

Womens T20 World Cup 2024 : మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో మ్యాచులు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. 10 జ‌ట్లు రెండు గ్రూపులుగా విడిపోయి త‌ల‌ప‌డుతున్నాయి. ప్ర‌తి గ్రూపు నుంచి రెండు జ‌ట్లు మాత్ర‌మే సెమీస్‌కు చేరుకుంటాయి. ఇక భార‌త జ‌ట్టు గ్రూపు-ఏలో ఉంది. కాగా.. న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా భారీ తేడాతో ఓడిపోయింది. దీంతో నెట్‌ర‌న్‌రేట్ భారీగా ప‌డిపోయింది. అదే స‌మ‌యంలో కివీస్ పై ఆస్ట్రేలియా భారీ విజ‌యం సాధించ‌డంతో గ్రూపు-ఏలో సెమీస్ రేసు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆస్ట్రేలియా ఇప్ప‌టికే రెండు విజ‌యాలు సాధించ‌డంతో ఆ జ‌ట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. అదే స‌మ‌యంలో ఆ జ‌ట్టు నెట్‌ర‌న్‌రేట్ (+2.524) కూడా మెరుగ్గా ఉండ‌డంతో దాదాపుగా ఆసీస్ సెమీ ఫైన‌ల్ బెర్తు ఖాయమైన‌ట్లే. ఇక రెండో బెర్తు కోసం మూడు జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. భార‌త్‌తో పాటు పాకిస్థాన్ (+0.555), న్యూజిలాండ్ (-0.05) రేసులో ఉన్నాయి.

IND vs BAN : భార‌త్‌తో రెండో టీ20 మ్యాచ్‌.. రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన బంగ్లాదేశ్ సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్

ఈ మూడు జ‌ట్లు కూడా రెండేసి చొప్పున మ్యాచులు ఆడగా.. ఒక్కో మ్యాచులో గెలుపొందాయి. దీంతో నెట్‌ర‌న్ ర‌న్‌రేట్ కీల‌కంగా మారనుంది. ఈ మూడు జ‌ట్లు ఇంకో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఆ రెండు మ్యాచుల్లో గెల‌వ‌డంతో పాటు నెట్‌ర‌న్‌రేట్ మెరుగ్గా ఉన్న జ‌ట్టు సెమీస్ చేరుకుంటుంది. ఇక ఒక్క మ్యాచ్ కూడా గెల‌వ‌ని శ్రీలంక రేసులో లేదు.

న్యూజిలాండ్ చేతిలో ఓడిన భార‌త్‌.. పాక్ పై విజ‌యం సాధించింది. ఇక ఈ రోజు భార‌త జ‌ట్టు శ్రీలంక‌తో త‌ల‌ప‌డ‌నుంది. ప్ర‌స్తుతం భార‌త ర‌న్‌రేట్ -1.217గా ఉంది. లంక‌తో మ్యాచులో క‌నీసం 40 ప‌రుగుల తేడాతో గెలిస్తే నెట్‌ర‌న్‌రేట్ ఫ్ల‌స్‌లోకి రానుంది. ఆఖ‌రి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై ఓ మోస్త‌రుగా గెలిచినా స‌రే భార‌త్ సెమీస్ చేరుకునేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఒక‌వేళ లంక చేతిలో భార‌త్ ఓడిపోతే టోర్నీ నుంచి ఇంటి ముఖం ప‌ట్ట‌క త‌ప్ప‌దు.

IRE vs SA : ద‌క్షిణాఫ్రికా, ఐర్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే.. అరుదైన ఘ‌ట‌న

భార‌త్‌, శ్రీలంక జ‌ట్లు ఇప్పటివరకు 25 టీ20 మ్యాచులు ఆడాయి. ఇందులో భారత్ 19 మ్యాచ్‌ల్లో గెలవగా, శ్రీలంక 5 మ్యాచుల్లో గెలిచింది. ఓ మ్యాచ్ రద్దయింది. ఇక టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడిన‌ నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సార్లు భారత్ గెలవగా, ఓ మ్యాచ్ శ్రీలంక నెగ్గింది.