IRE vs SA : దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ జట్ల మధ్య మూడో వన్డే.. అరుదైన ఘటన
దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది.

Batting coach Duminy fields for South Africa as substitute amid injury
IRE vs SA : దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ జేపీ డుమిని సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అబుదాబి వేదికగా దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది. అయితే.. వేడి వాతావరణం కారణంగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అలసటకు గురి అయ్యారు. దీంతో ఐర్లాండ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ప్రారంభానికి ముందు ఫీల్డింగ్ చేసేందుకు ఓ ఆటగాడు తక్కువ అయ్యాడు. దీంతో బ్యాటింగ్ కోచ్ జేపీ డుమిని సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. డైవ్ చేసి ఓ పరుగు కూడా సేవ్ చేశాడు.
IRE vs SA : ఐర్లాండ్ సంచలన విజయం.. ఆఖరి వన్డేలో ఓడిపోయిన దక్షిణాఫ్రికా..
2004 నుంచి 2019 వరకు దక్షిణాఫ్రికాకు జేపీ డుమిని ప్రాతినిధ్యం వహించాడు. 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20ల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆల్‌రౌండర్‌గానే కాకుండా బెస్ట్ ఫీల్డర్‌గా జట్టు విజయాల్లో డుమిని కీలక పాత్ర పోషించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 9 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 46.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఐర్లాండ్ 69 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా.. తొలి రెండు వన్డేల్లో గెలిచిన సౌతాఫ్రికా 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
IND vs BAN : ఢిల్లీ చేరుకున్న టీమ్ఇండియా ప్లేయర్లు.. కెప్టెన్ సూర్యకుమార్ డ్యాన్స్ చూశారా?
Look who’s on the field! JP Duminy !😲 pic.twitter.com/HhBwFQsLJY
— Khushi♡🥀 (@Derivatemee) October 7, 2024