పంజాబ్‌పై హైదరాబాద్ ఘన విజయం

IPL 2020 KXIP Vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 22వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ముఖాముఖి ఇవాళ(08 అక్టోబర్ 2020) తలపడగా.. ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 69పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. 202పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 132 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
నికోలస్ పూరన్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్లు పెద్దగా స్కోరు చెయ్యలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 9 పరుగులకే రనౌట్ కాగా, సిమ్రాన్ సింగ్ 11, కెఎల్ రాహుల్ 11, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 7, మన్‌దీప్ సింగ్ 6, ముజీబ్ 1 పరుగు చేసి పెవిలియన్ చేరారు. నికోలస్ పూరన్ మాత్రమే ఒంటరి పోరాటంలో 37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్‌ను గట్టెక్కంచే క్రమంలో దూకుడుగా ఆడిన పూరన్ ఒంటరి పోరాటం 126పరుగుల వద్ద ముగిసింది. పూరన్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో నటారాజన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 126స్కోరు వద్ద 3వికెట్లు కోల్పోయింది పంజాబ్.. రెహ్మాన్, షమీ కూడా 126పరుగులు వద్దే అవుట్ అయ్యారు. ఆరవ వికెట్‌గా ముజీబ్ వికెట్ కోల్పోయింది పంజాబ్ జట్టు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి ముజీబ్ అవుట్ అయ్యాడు. 5వ వికెట్‌గా మణిదీప్ సింగ్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మణిదీప్ బౌల్డ్ అయ్యాడు.
పూరన్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నాడు అనుకుంటున్న సమయంలో మ్యాక్స్‌వెల్ అవుట్ అయ్యాడు. 12బంతుల్లో 7పరుగులు మాత్రమే చేసి రన్‌ఔట్ అయ్యి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో ఆల్మోస్ట్ పంజాబ్.. ఓటమికి చేరువ అయనట్లుగా అనిపించింది. మ్యాక్స్‌వెల్ నాల్గవ వికెట్‌గా 105పరుగుల వద్ద అవుట్ అవగా.. తర్వాత పంజాబ్ జట్టు కేవలం 27పరుగులు మాత్రమే చేసింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు ప్లేయర్లు.. బెయిర్ స్టో, వార్నర్‌లు అదరగొట్టేశారు. మొదటి వికెట్‌కు 160పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వార్నర్ 40బంతుల్లో 52పరుగులు, బెయిర్ స్టో 55బంతుల్లో 97పరుగులు చెయ్యగా.. భారీ స్కోరు దిశగా హైదరాబాద్ దూసుకెళ్తున్న సమయంలో వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు వార్నర్(52), బెయిర్ స్టో(97) ఒకే ఓవర్లో రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు.
Truly a Man of the Match kinda performance ??#SRHvKXIP #OrangeArmy #KeepRising pic.twitter.com/NKhxMXrnnz
— SunRisers Hyderabad (@SunRisers) October 8, 2020
అనంతరం అర్ష్‌దీప్ ఓవర్లో మనీష్ పాండే కూడా అవుట్ అయ్యాడు. వరుస నాలుగు ఓవర్లలో 5వికెట్లు కోల్పోయింది. 15వ ఓవర్ 1వ బంతికి బెయిర్ స్టో(97), 15వ ఓవర్ 4వ బంతికి వార్నర్(52) ఇద్దరూ బిష్ణోయ్ బౌలింగ్‌లో 160పరుగుల వద్ద అవుట్ అవగా.. 16ఓవర్‌లో 1వ బంతికి మనీష్ పాండే(1) 161పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అనంతరం అబ్ధుల్ సమద్ 17ఓవర్‌లో 5వ బంతికి 173పరుగుల వద్ద 18ఓవర్ 1వ బంతికి ప్రియమ్ గార్గ్ 175పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత కాస్త వేగం తగ్గింది అనుకున్న సమయంలో హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు విలియమ్సన్, అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించగా.. హైదరాబాద్ స్కోరు 200మార్క్ రీచ్ అయ్యింది. అభిషేక్ శర్మ 6బంతుల్లో 12పరుగులు చేసి అవుట్ అవ్వగా.. విలియమ్సన్ 10బంతుల్లో 20పరుగులు చేశారు. ఓవరాల్‌గా నిర్ణీత 20ఓవర్లలో హైదరాబాద్ జట్టు 201పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా బెయిర్ స్టో నిలిచాడు.
రషీద్ ఖాన్ నాలుగు ఓవర్లలో 12పరుగులు మాత్రమే ఇచ్చి 3వికెట్లు తీసుకోగా.. ఖలీల్ అహ్మద్, నటరాజన్ చెరో రెండు వికెట్లు, అభిషేక్ శర్మ ఒక్క వికెట్ తీసుకున్నారు. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3వికెట్లు, అర్షదీప్ రెండు వికెట్లు, షమీ ఒక్క వికెట్ తీసుకున్నారు.
The maestro spun his ?️, again! ?#SRHvKXIP #OrangeArmy #KeepRising @rashidkhan_19
— SunRisers Hyderabad (@SunRisers) October 8, 2020