KKRvDC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్ 12లో 26వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్… ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ ఇరు జట్ల మధ్య మార్చి 30న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భీకరపోరు కనిపించింది.
చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు కోల్‌కతాకు సమంగా స్కోరు చేసింది. విజయం కోసం ఏర్పాటు చేసిన సూపర్ ఓవర్లో ఢిల్లీ బౌలర్ రబాడ మ్యాచ్ ను తిప్పేశాడు. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను సునాయాసంగా చిత్తు చేయడంతో విజయం ఢిల్లీనే వరించింది.
ఈ క్రమంలో మరోసారి అదే స్థాయిలో పోటీని ఇవ్వనున్నామని ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ లీగ్‌లో 6మ్యాచ్ లు ఆడగా 3మాత్రమే గెలిచింది. మరోవైపు ఆరింటికి గానూ 4 మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది.
ఈ మ్యాచ్‌కు ఇరుజట్లలో మార్పులు చోటు చేసుకున్నట్లు టాస్ అనంతరం కెప్టెన్లు తెలిపారు. లామిచానెకు బదులుగా కీమో పాల్ బరిలోకి దిగనున్నట్లు శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు. మూడు మార్పులతో సిద్ధమవుతోన్న కోల్‌కతా జట్టులో నరైన్, గర్నీకు బదులుగా లాకీ ఫెర్యూసన్, జో డెన్లీ, కార్లొస్ బ్రాత్ వైట్ ఆడనున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్:
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కొలిన్ ఇంగ్రామ్, క్రిస్ మోరిస్, అక్సర్ పటేల్, రాహుల్ తెవాటియా, కీమోపాల్, కగిసో రబాడా, ఇషాంత్ శర్మ
కోల్‌కతా నైట్ రైడర్స్:
జో డెన్లీ, రాబిన్ ఊతప్ప, నితీశ్ రానా, దినేశ్ కార్తీక్, శుభ్‌మాన్ గిల్, ఆండ్రీ రస్సెల్, కార్లొస్ బ్రాత్‌వైట్, పీయూశ్ చావ్లా, కుల్దీప్ యాదవ్, లాకీ ఫెర్యూసన్, ప్రసిద్ధ్ కృష్ణ