KL Rahul : దుమ్మురేపిన కేఎల్ రాహుల్‌.. వెస్టిండీస్ పై సూప‌ర్ సెంచ‌రీ.. స్వ‌దేశంలో తొమ్మిదేళ్ల త‌రువాత..

వెస్టిండీస్‌తో అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (KL Rahul ) సెంచ‌రీ చేశాడు.

KL Rahul : దుమ్మురేపిన కేఎల్ రాహుల్‌.. వెస్టిండీస్ పై సూప‌ర్ సెంచ‌రీ.. స్వ‌దేశంలో తొమ్మిదేళ్ల త‌రువాత..

KL Rahul century against westindies in 1st test

Updated On : October 3, 2025 / 11:46 AM IST

KL Rahul : టీమ్ఇండియా ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ త‌న ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించిన అత‌డు ఇప్పుడు వెస్టిండీస్ పైన శ‌త‌కం బాదాడు. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు తొలి ఇన్నింగ్స్‌ల్లో కేఎల్ రాహుల్ (KL Rahul )190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచ‌రీ సాధించాడు. టెస్టుల్లో రాహుల్‌కు ఇది 11వ‌ శ‌త‌కం కావ‌డం విశేషం.

కాగా.. స్వ‌దేశంలో అత‌డికి ఇది రెండో సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. తొమ్మిది సంవ‌త్స‌రాల క్రితం 2016లో చెన్నైలోని చెపాక్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాహుల్ 199 ప‌రుగులు సాధించాడు. ఆ మ్యాచ్‌లో తృటిలో డ‌బుల్ సెంచ‌రీని చేజార్చుకున్నాడు.

Mirabai Chanu : ప్ర‌పంచ ఛాంపియ‌న్ షిప్‌లో స‌త్తా చాటిన మీరాబాయి చాను.. ర‌జ‌తం..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. రెండో రోజు లంచ్ విరామానికి భార‌త్ తొలి ఇన్నింగ్స్‌ల్లో 67 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 218 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం 56 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. కేఎల్ రాహుల్‌తో పాటు ధ్రువ్ జురెల్ (14) క్రీజులో ఉన్నాడు. అంత‌క ముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే.