IPL 2025: విశాఖ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ను చూడలేమా? ఎందుకంటే? ఇది ఢిల్లీ జట్టుకూ షాకే..

ఢిల్లీ జట్టు యంగ్‌ ప్లేయర్లతో బలంగా ఉందని, అయినా కేఎల్ రాహుల్‌ టీ20 టోర్నీలో చాలా కీలకమని ఆమె అన్నారు.

IPL 2025: విశాఖ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ను చూడలేమా? ఎందుకంటే? ఇది ఢిల్లీ జట్టుకూ షాకే..

KL Rahul

Updated On : March 21, 2025 / 9:05 PM IST

టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌ 2025 సీజన్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ భార్య అథియా శెట్టి తొలి బిడ్డకు జన్మనివ్వనుండడంతో అతడు రెండు ఐపీఎల్‌ మ్యాచుల్లో ఆడకపోవచ్చని ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్‌ అలిస్సా హిలీ చెప్పారు.

కేఎల్‌ రాహుల్ ఐపీఎల్‌ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్ మిచెల్ స్టార్క్‌కు భార్యే అలిస్సా హీలీ. దీంతో కేఎల్ రాహుల్‌కు సంబంధించిన వివరాలు ఆమెకు తెలిశాయి.

Also Read: కొత్తగా మూడు రూల్స్‌ తీసుకొచ్చిన బీసీసీఐ.. అవేంటంటే?

ఆమె యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. హ్యారీ బ్రూక్‌ ఐపీఎల్‌లో ఆడట్లేదని చెప్పారు. ఢిల్లీ జట్టులో హ్యారీ స్థానంలో ఎవరు ఆడతారో చూడాలని చెప్పారు. కేఎల్‌ రాహుల్‌ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కావచ్చని, అతడు తండ్రి కాబోతున్నాడని తెలిపారు.

ఢిల్లీ జట్టు యంగ్‌ ప్లేయర్లతో బలంగా ఉందని, అయినా కేఎల్ రాహుల్‌ టీ20 టోర్నీలో చాలా కీలకమని ఆమె అన్నారు. అతడు బాగా ఆడతాడని చెప్పారు. కాగా, ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో కేఎల్‌ రాహుల్‌ రూ.12 కోట్లు దక్కాయి. ఢిల్లీ, లక్నో జట్లు ఈ నెల 24న విశాఖ వేదికగా తలపడనున్నాయి. ఈ ఐపీఎల్‌లో విశాఖపట్నంలో రెండు మ్యాచులు మాత్రమే జరగనున్నాయి.