కోహ్లీకి సర్‌ప్రైజ్: ట్రైనింగ్ క్యాంప్‌కు వచ్చిందెవరో తెలుసా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్రైనింగ్ క్యాంప్‌లో సర్‌ప్రైజ్ ఎదురైంది. ఐపీఎల్ మొదలయ్యేందుకు ఇంకా రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో ఆటలో మెలకువలతో పాటు, ఫిట్‌నెస్ పైనా దృష్టి పెట్టింది బెంగళూరు జట్టు. ఫుట్‌బాల్‌లో బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సునీల్ చెత్రి చిన్నస్వామి స్డేడియానికి వచ్చాడు.
మార్చి 17ఆదివారం ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) విజేతగా నిలిచిన ఫుట్‌బాల్ టీం బెంగళూరు ఎఫ్‌సీ కెప్టెన్ సునీల్ ఛెత్రి చిన్నస్వామి స్టేడియానికి వచ్చాడు. చాలాకాలం నుంచి మిత్రులైన విరాట్ కోహ్లీకి అది సర్‌ప్రైజ్‌గా అనిపించింది. విదేశీ ప్లేయర్లతో పాటు కొనసాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సునీల్ చెత్రిని పరిచయం చేశాడు.
Read Also : మోడీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పింది
ట్రైనింగ్ క్యాంపులో ఈ రోజంతా తన స్నేహితుడు తమతోనే గడుపుతాడని అతనికి సహకరించాల్సిందిగా కోరాడు. కొందరు స్టార్ ఫుట్‌బాలర్ చెత్రి ఫిట్‌నెస్ గురించి వాకబు చేశారు. ఈ విషయాన్ని కోహ్లీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు.
‘కెప్టెన్ సునీల్ చెత్రితో నిన్న ట్రైనింగ్‌లో సరదాగా గడిచిపోయింది’ అంటూ కోహ్లీ పోస్టు చేశాడు. ఇన్ని సీజన్లు గడిచినప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క టైటిల్ కూడా గెలుచుకోలేకపోయింది. కాగా, మార్చి 23నుంచి జరగనున్న తొలి ఐపీఎల్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, టైటిల్ ఫేవరేట్ చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య చిదంబరం స్టేడియం వేదికగానే జరగనుంది.
Read Also : ఫేస్‌బుక్ బిగ్ బిజినెస్ ట్రిక్ : ఇన్‌స్టాగ్రామ్‌లో Shopping ఫీచర్ చూశారా?