KKR vs CSK : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా..

KKR vs CSK : ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా 21వ మ్యాచ్ జరుగుతోంది. కోల్‌కతా, చెన్నై జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్ ఎంచుకుంది.
కోల్ కతా ఓపెనర్లుగా బరిలోకి దిగిన త్రిపాఠి (23), శుభ్ మన్ గిల్ (11) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి కోల్ కతా 37 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ థాకూర్ బౌలింగ్ లో ధోనికి క్యాచ్ ఇచ్చిన గిల్ తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు..
ఈ సీజన్‌లో 5 మ్యాచ్‌లాడిన చెన్నై.. రెండు మ్యాచ్ ల్లో గెలిచింది. మూడు మ్యాచ్ ల్లో ఓడింది.. దీంతో పాయింట్ల పట్టికలో 5వ ర్యాంకులో కొనసాగుతోంది.
కోల్ కతా కూడా నాలుగు మ్యాచ్‌లాడి రెండు విజయాలు సాధించింది. రెండు ఓటములతో 4వ స్థానంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు జరిగాయి. చెన్నై 14 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. కోల్ కతా 8 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.
ఇక బ్యాటింగ్‌లో శుబ్‌మన్ గిల్, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్‌లు రాణిస్తున్నారు. దినేష్ కార్తిక్, ఆండ్రీ రసెల్ పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేక పోతున్నారు. ఈ మ్యాచ్ లోనైనా కోల్ కతా పుంజుకుంటుందో లేదో చూడాలి.
చెన్నై జట్టు :
ఎంఎస్ ధోని(కెప్టెన్), షేన్ వాట్సన్, అంబటి రాయుడు, డుప్లెసిస్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, సామ్ కరాన్,కరణ్ శర్మ, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్
కోల్‌కతా జట్టు :
దినేశ్ కార్తీక్(కెప్టెన్), సునీల్ నరైన్, శుబ్‌మన్ గిల్, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రసెల్, ప్యాట్ కమిన్స్, నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి, రాహుల్ త్రిపాఠి, శివం మావి
#KKR have won the toss and they will bat first against #CSK.#Dream11IPL pic.twitter.com/7iDHNesmDv
— IndianPremierLeague (@IPL) October 7, 2020
A look at the Playing XI for #KKRvCSK #Dream11IPL pic.twitter.com/E6ewcGTtQo
— IndianPremierLeague (@IPL) October 7, 2020