నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్
వైభవ్ సూర్యవంశీ కేవలం 4 పరుగులే చేసి ఔటయ్యాడు.

PIC: @IPL (X)
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
Also Read: హీరో నితిన్ “తమ్ముడు” రిలీజ్ డేట్ కన్ఫాం.. ఫన్నీ వీడియో విడుదల చేసిన మూవీ టీమ్
లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 34, వైభవ్ సూర్యవంశీ 4, కునాల్ సింగ్ రాథోడ్ 0, రియాన్ పరాగ్ 95, ధ్రువ్ జురెల్ 0, వనిందు హసరంగా 0, షిమ్రాన్ హెట్మేయర్ 29, శుభమ్ దూబే 25 (నాటౌట్), జోఫ్రా ఆర్చర్ 12 పరుగులు చేశారు. 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 205గా నమోదైంది.
దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఒక్క రన్ తేడాతో గెలుపొందింది. కేకేఆర్ బౌలర్లలో మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చకారవర్తి రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టగా, వైభవ్ అరోరా ఒక వికెట్ తీశాడు.
అంతకు ముందు కేకేఆర్ టీమ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ 35, సునీల్ నరైన్ 11, అజింక్య రహానే 30, అంగ్క్రిష్ రఘువంశీ 44, ఆండ్రీ రస్సెల్ 57 (నాటౌట్), రింకూ సింగ్ 19 (నాటౌట్) రన్స్ చేశారు.
ఆర్ఆర్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్, మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ చొప్పన తీశారు.