KXIP vs DC: ఢిల్లీపై పంజాబ్ పోరాటం ఫలించేనా..

ఐపీఎల్‌లో భాగంగా 13వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ల మధ్య జరగనుంది. క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్‌ను ముగిస్తున్న ఇరు జట్లకు ఈ మ్యాచ్ పెను సవాల్ గా మారనుంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ సూపర్ ఓవర్లో కోల్‌కతాపై విజయం సాధించింది. మరో వైపు శనివారం పంజాబ్.. ముంబై ఇండియన్స్‌పై ఛేధనకు దిగి ఇంకా 8 బంతులు ఉండగానే విజయాన్ని చేజిక్కించుకుంది.
Read Also : IPL 2019: రహానె దొరికిపోయాడు.. రూ.12లక్షలు జరిమానా
కోల్‌కతాపై విజయానంతరం ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. థకం ప్రకారమే.. ఆడి గెలిచాం. ఈ సారి ఒక ఓవర్ ముందుగానే మ్యాచ్ ముగించాలనుకుంటున్నాం’ అని విశ్వాసం వ్యక్తపరిచాడు. మరో వైపు పంజాబ్ జట్టు ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో రకంగా కాంట్రవర్సీగా మిగులుతోంది.
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ రనౌట్ విషయంలో వివాదంలో నలిగిపోగా, తర్వాతి మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌కు 7 బాల్‌లు విసరి మరోసారి వార్తల్లో నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్. భారీ ఎత్తుగడల మధ్య బరిలోకి దిగాలని యోచిస్తున్న ఇరు జట్లలో విజయం ఎవరిని వరించేనో.. కాగా, విశ్లేషకుల అంచనా ప్రకారం కాలం కలిసొస్తే ఢిల్లీ క్యాపిటల్స్‌యే ఈ మ్యాచ్ గెలవవచ్చు.
Read Also : ICC వరల్డ్ కప్ జట్టు ప్రకటించే తేదీ ఎప్పుడంటే..