KXIPvsDC: పంజాాబ్‌ను ఢిల్లీ కొట్టేసింది

KXIPvsDC: పంజాాబ్‌ను ఢిల్లీ కొట్టేసింది

Updated On : April 20, 2019 / 6:12 PM IST

సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చితక్కొట్టింది. చివరి బాల్ వరకూ సాగిన ఉత్కంఠపోరులో శ్రేయాస్ అయ్యర్ కీలకంగా వ్యవహరించి జట్టుకు చక్కటి విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ఢిల్లీ.. పంజాబ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

164 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలో కాస్త తడబడినా క్రమంగా పుంజుకుంది. పృథ్వీ షా(13)నిరాశపర్చినప్పటికీ మరో ఓపెనర్ శిఖర్ ధావన్(56; 41 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్సు)తో చక్కటి ఆరంభాన్నిచ్చాడు. ఇక ఆ తర్వాత ఆటంతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌దే. 

మూడో వికెట్‌గా బరిలోకి దిగిన శ్రేయాస్(58; 49 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సు)తో క్రీజులో పాతుకుపోయాడు. మరో ఎండ్ లో వికెట్లు వరుసగా పడుతున్నా సహనంతో బౌలర్లను ఎదుర్కొని బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ కనబరిచాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(6), ఇన్‌గ్రామ్(19), అక్సర్ పటేల్(1), రూథర్ ఫర్డ్(2)పరుగులు మాత్రమే చేయగలిగారు. 

పంజాబ్ బౌలర్లలో షమీ 1 వికెట్ తీయగా, హార్దస్ విల్జియోన్ 2వికెట్లు తీయగలిగారు. 

అంతకంటే ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్163 పరుగులు చేసేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేవరకూ 7 వికెట్లు నష్టపోయింది. ఓపెనర్లుగా దిగిన కేఎల్ రాహుల్(12), క్రిస్ గేల్(69; 37బంతుల్లో 6ఫోర్లు, 5 సిక్సులు) చేసి జట్టు స్కోరు పరుగులు పెట్టించారు. 

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన మయాంక్ అగర్వాల్(2), డేవిడ్ మిల్లర్(7), మన్దీప్ సింగ్(30), శామ్ కరన్(0), రవిచంద్రన్ అశ్విన్(16), హర్పీత్ బ్రార్(20), విల్జియోన్(2)పరుగులతో సరిపెట్టుకున్నారు.