KXIPvsSRH: పంజాబ్‌ పవర్ సరిపోలేదు

213 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 8వికెట్లు నష్టపోయి 45 పరుగుల తేడాతో ఓటమికి గురైంది. 

KXIPvsSRH: పంజాబ్‌ పవర్ సరిపోలేదు

Updated On : April 29, 2019 / 6:13 PM IST

213 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 8వికెట్లు నష్టపోయి 45 పరుగుల తేడాతో ఓటమికి గురైంది. 

సమఉజ్జీల మధ్య జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందడుగేసింది. లీగ్ పట్టికలో 10 పాయింట్లతో సమంగా ఉన్న ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 213 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 5వికెట్లు నష్టపోయి పరుగుల తేడాతో ఓటమికి గురైంది. హైదరాబాద్ బౌలర్లు సత్తా చూపించడంతో ఖలీల్ అహ్మద్(3), సందీప్ శర్మ(2), రషీద్ ఖాన్(3)వికెట్లు దక్కాయి. 

ఓపెనర్ కేఎల్ రాహుల్(79; 56 బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సులు) ఒంటరిపోరాటం చేసినప్పటికీ చక్కటి భాగస్వామ్యం కరువైంది.  క్రిస్ గేల్(4), మయాంక్ అగర్వాల్(27), నికోలస్ పూరన్(21), డేవిడ్ మిల్లర్(11), రవిచంద్రన్ అశ్విన్(0), సిమ్రాన్ సింగ్(16), మురుగన్ అశ్విన్(1), ముజీబ్ ఉర్ రెహ్మాన్(0), మొహమ్మద్ షమీ(1)పరుగులతో సరిపెట్టుకున్నారు. 

అంతకంటే ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప్లే ఆఫ్ రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టి పట్టుదల కనబరచింది. ఈ క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు 213 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఓపెనర్‌గా దిగిన డేవిడ్ వార్నర్(81; 56 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సులు)తో విజృంభించాడు. జట్టుకు తానొక్కడే హైస్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన ప్లేయర్లు పరవాలేదనిపించే స్కోరు చేయడంతో 212 పరుగులు చేయగలిగారు. 

వృద్ధిమాన్ సాహా(28; 13 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సు), మనీశ్ పాండే(36; 25బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సు), మొహమ్మద్ నబీ(20), కేన్ విలియమ్సన్(14), రషీద్ ఖాన్(1), విజయ్ శంకర్(7), అభిషేక్ శర్మ(5)పరుగులు చేయగలిగారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, మురుగన్ అశ్విన్ చెరో వికెట్ తీయగా, మొహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ తలో 2వికెట్లు పడగొట్టారు.