Virat Kohli Lamborghini: అమ్మకానికి విరాట్ కోహ్లీ లాంబోర్గిని కార్

పాత జనరేషన్లలో విదేశాల్లో మాత్రమే ఉంటాయనుకునే స్పోర్ట్స్ కార్లు అడపాదడపా ఇండియాలోనూ, మన సిటీల్లోనూ కనిపించేస్తున్నాయి.

Virat Kohli Lamborghini: అమ్మకానికి విరాట్ కోహ్లీ లాంబోర్గిని కార్

Virat Kohli Lamborghini

Updated On : May 5, 2021 / 11:58 AM IST

Virat Kohli Lamborghini: పాత జనరేషన్లలో విదేశాల్లో మాత్రమే ఉంటాయనుకునే స్పోర్ట్స్ కార్లు అడపాదడపా ఇండియాలోనూ, మన సిటీల్లోనూ కనిపించేస్తున్నాయి. స్పోర్ట్స్ కార్ సొంతం చేసుకున్న సెలబ్రిటీలలో విరాట్ కోహ్లీ ఒకరు. విరాట్ లగ్జరీ కార్ల కలెక్షన్లో లాంబోర్గినీ ఒకటి. అయితే ఇది ప్రస్తుతం అమ్మకానికి రెడీగా ఉందట.

నజీబ్ రెహ్మాన్ కేపీ అనే యూజర్ యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేశాడు. ఆ వీడియోలో లాంబోర్గినీ గాలార్డో స్పైడర్ గురించి దాని ఫీచర్లు, పర్ ఫార్మెన్స్ అంతా పూస గుచ్చినట్లుగా చెప్తున్నాడు. అమ్మకానికి పెట్టిన ఈ కార్ విరాట్ కోహ్లీదే.

దీని ప్రొడక్షన్ 2003 నుంచి 2013వరకూ మాత్రమే జరిగింది. వీడియోలో కనిపించేది 2013 మోడల్. ముందు వర్షన్లతో పోల్చి చూస్తే దీని బంపర్ డిఫరెంట్ లుక్ తో పాటు సెంటర్లో స్ప్లిట్టర్ కొత్తగా ఉంటుంది. లాంబోర్గినీ లోగో హుడ్ కింద హుడ్ లో ఉంది. స్మాల్ బ్యాగ్ పెట్టుకోవడానికి కాస్త స్పేస్ తో కారుపైన బ్లాక్ కలర్ లో ఉంటుంది.

గాలార్డో పూర్తి డిజైన్ పక్కవైపు నుంచి చూస్తే ఏరో డైనమిక్ గా ఉంటుంది. అంతేగాక 19 అంగుళాల బ్లాక్ అల్లోయ్ వీల్స్, షార్ప్ ఎల్ఈడీ టైల్ లైట్ తో ఉంది. గల్లార్డో మిడ్ ఇంజిన్ ఒక స్పోర్ట్స్ కార్. ఇక ఈ కార్ ఫొటోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు సహచరుడు సీన్ అబాట్ కూడా షేర్ చేశాడు.

2 సీటర్ స్పోర్ట్స్ కార్.. 4 సెకన్లలో 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని ధర దాదాపు 3.36 కోట్ల రూపాయలు ఉండొచ్చు. దానిని కోహ్లీ కేవలం రూ.1.35 కోట్లకే అందుబాటులో ఉంది.