హార్దిక్ పాండ్యాపై ట్రోలింగ్ ఇప్పట్లో ఆగేట్టు లేదు.. మరో వీడియో వైరల్

ముంబై బౌలింగ్ కోచ్ లసిత్ మలింగాను హార్దిక్ అవమానించాడని నెటిజనులు మండిపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో వైరల్‌గా మారింది.

హార్దిక్ పాండ్యాపై ట్రోలింగ్ ఇప్పట్లో ఆగేట్టు లేదు.. మరో వీడియో వైరల్

Lasith Malinga: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రవర్తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగుతూనే ఉంది. అతడి ప్రతి చర్యపైనా నెటిజనులు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి తోడు తాజా ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మొదటి రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలవడంతో పాండ్యాపై దాడి మరింత తీవ్రమైంది. రోహిత్ శర్మను తొలగించి ముంబై టీమ్ కెప్టెన్‌గా నియమించినప్పటి నుంచి హార్దిక్ విమర్శలపాలవుతున్నాడు.

తాజాగా ముంబై బౌలింగ్ కోచ్ లసిత్ మలింగాను హార్దిక్ అవమానించాడని నెటిజనులు మండిపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో వైరల్‌గా మారింది. లసిత్ మలింగాను కుర్చీలోంచి వెళ్లగొట్టి తాను కూర్చుకున్నాడని నెటిజనులు ఫైర్ అవుతున్నారు. కెప్టెన్ హార్దిక్ కోసం కీరన్ పొలార్డ్ కుర్చీలోంచి లేచి అతడికి ఇవ్వబోతాడు. ఇంతలో అతడి పక్కనే కుర్చీలో కూర్చున్న మలింగ.. పొలార్డ్‌ను వారించి, తాను కుర్చీలోంచి లేచి అసహసంగా వెళ్లిపోయిన విజువల్స్ వీడియోలో ఉన్నాయి.

Also Read: సూపర్ స్టార్ రజనీకాంత్ సలహాతోనే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ భారీ రికార్డు! వీడియో వైరల్

ఈ వీడియో చూసిన నెటిజనులు.. సీనియర్లను ఎలా గౌరవించాలో పాండ్యాకు తెలియదంటూ విమర్శలు చేస్తున్నారు. కనీసం మలింగాను ఆపే ప్రయత్నం చేయలేదని మండిపడుతున్నారు. ఇంకో కుర్చీ తెప్పించుకునే వెసులుబాటు ఉన్నా మలింగాను కావాలనే అవమానించాడని ఆరోపిస్తున్నారు. పొలార్డ్ కూడా పాండ్యా పక్కన కంఫర్టబుల్‌గా కూర్చొలేకపోయాడని అంటున్నారు. కెప్టెన్ పాండ్యాపై అందరూ అసంతృప్తిగా ఉన్నారనడానికి ఇంత కన్నా రుజువులు అవసరం లేదని కామెంట్ చేస్తున్నారు.