LSG vs CSK Preview : గురు శిష్యుల పోరు.. గెలుపెవరిదో?.. లక్నో, చెన్నైల హెడ్-టు-హెడ్, పిచ్ రిపోర్ట్.. ఇంకా..
సోమవారం లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. సోమవారం లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.
ఈ సీజన్‌లో రిషబ్ పంత్ నాయకత్వంలో బరిలోకి దిగిన లక్నోసూపర్ జెయింట్స్ అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఆ జట్టు 6 మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లోనే ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 8 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ +0.162గా ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న లక్నో.. మరో విజయాన్ని సొంతం చేసుకుని ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువ కావాలని ఆరాటపడుతోంది.
Mumbai Indians : చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. అన్నీ విజయాలే..
అటు ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు ఆ జట్టు 6 మ్యాచ్‌లు ఆడగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో చెన్నై కొనసాగుతోంది. మరో విజయాన్ని సాధించాలని భావిస్తోంది. లక్నోతో మ్యాచ్‌లో ఓడిపోతే సీఎస్‌కే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించినట్లే.
హెడ్-టు-హెడ్..
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు చెన్నై, లక్నో జట్లు ఐదు సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో లక్నో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఓ మ్యాచ్‌లో చెన్నై గెలిచింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
పిచ్ రిపోర్ట్..
ఎకానా స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికి అనుకూలంగా ఉంటుంది. ఆట ప్రారంభంలో పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తూ ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్ది స్సిన్నర్లు ప్రభావం చూపుతారు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంటుంది. ఇది బ్యాటింగ్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుంది.
తుది జట్ల అంచనా..
లక్నో సూపర్ జెయింట్స్..
మిచెల్ మార్ష్, ఐడెన్ మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ రతి, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.
చెన్నై సూపర్ కింగ్స్..
డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివమ్ దుబే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరాణా