IPL 2023: ఎలిమినేటర్ మ్యాచ్.. పిచ్ ఎవరికి అనుకూలం? సూర్య సంగతేంటీ?

చెపాక్ స్టేడియంలో బ్యాటింగ్ అంత ఈజీ కాదు. స్పిన్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొనేవారు రాణించవచ్చు.

IPL 2023: ఎలిమినేటర్ మ్యాచ్.. పిచ్ ఎవరికి అనుకూలం? సూర్య సంగతేంటీ?

LSG vs MI

Updated On : May 24, 2023 / 3:14 PM IST

LSG vs MI: ముంబై ఇండియన్స్ (Mumbai Indians), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్ల మధ్య బుధవారం రాత్రి 7.30 గంటలకు ఎలిమినేటర్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో మొదటి క్వాలిఫయర్ మ్యాచులో గుజ‌రాత్ టైటాన్స్‌పై చెన్నై సూప‌ర్ కింగ్స్ విజయం సాధించడంతో సీఎస్కే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.

ముంబై, లక్నో మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచే జట్టు శుక్రవారం రెండో క్వాలిఫయర్ లో గుజరాత్ టైటాన్స్ తో ఆడాల్సి ఉంటుంది. రెండో క్వాలిఫయర్ లో గెలిచే జట్టు ఆదివారం సీఎస్కేతో ఫైనల్ లో తలపడుతుంది.

ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్ స్టేడియం)లో మ్యాచ్ జరుగుతుంది. ఈ మైదానం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. మొదట బ్యాటింగ్ కు దిగే జట్టు స్కోరు 165 పరుగులు దాటితే ఉత్తమ స్కోరనే చెప్పవచ్చు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లేదా జియో సినిమాలో ఈ మ్యాచ్ చూడొచ్చు.

లక్నో జట్టు అంచనా: క్వింటన్ డి కాక్, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, మొహసిన్ ఖాన్, అవేశ్ ఖాన్

ముంబై జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, కుమార్ కార్తికేయ, క్రిస్ జోర్డాన్, పీయూశ్ చావ్లా, జాసన్, ఆకాశ్

చెపాక్ స్టేడియంలో బ్యాటింగ్ అంత ఈజీ కాదు. స్పిన్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొనేవారు రాణించవచ్చు. సూర్యకుమార్ యాదవ్ రాణించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ లో అతడు 14 మ్యాచులు ఆడి 511 పరుగులు చేశాడు. కుడిచేతి వాట లెగ్‌బ్రేక్ గూగ్లీ బౌలర్ రవి బిష్ణోయ్ రాణించే అవకాశాలూ ఉన్నాయి.

Sourav Ganguly: బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీకి కీలక బాధ్యతలు ..