Toby Roland Jones : ఎంత దురదృష్టమో.. బంతి ఏమో సిక్సర్‌గా వెళ్లింది.. కానీ బ్యాటర్ ఔట్.. ఒక్క పరుగు రాలే
క్రికెట్‌లో అప్పుడప్పుడు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటాయి. బ్యాటర్లు వినూత్న రీతిలో ఔట్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి సిక్సర్‌గా వెళ్లింది. అయితే.. ఫీల్డర్లు మాత్రం బ్యాట్స్‌మెన్ ఔట్ అంటూ అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చాడు.
Toby Roland Jones hit wicket : క్రికెట్‌లో అప్పుడప్పుడు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటాయి. బ్యాటర్లు వినూత్న రీతిలో ఔట్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి సిక్సర్‌గా వెళ్లింది. అయితే.. ఫీల్డర్లు మాత్రం బ్యాట్స్‌మెన్ ఔట్ అంటూ అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఈ ఘటన బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంపైర్ అలా ఎలా ఔట్ ఇచ్చాడు..? ఏం జరిగింది..? అనేది చూద్దాం.
కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మిడిల్‌సెక్స్(middlesex )తో వార్విక్‌షైర్ (warwickshire) జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మిడిల్‌సెక్స్ కెప్టెన్ టోబీ రోలాండ్ జోన్స్ (Toby Roland Jones)ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మిడిల్‌సెక్స్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో వార్విక్‌షైర్ జట్టు కేవలం 60 పరుగులకే మొదటి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. అనంతరం మిడిల్‌సెక్స్ తన మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. బ్యాటర్లు రాణించడంతో కెప్టెన్ టోబీ తొమ్మిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వెళ్లే సమయానికి మిడిల్‌సెక్స్ 88 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Harmanpreet Kaur : భారత కెప్టెన్‌కు ఐసీసీ షాక్.. రెండు మ్యాచుల నిషేదం.. ఎందుకంటే..?
ఈ క్రమంలో అతడు దూకుడుగా ఆడాడు. అయితే వింత పద్ధతిలో తన వికెట్ కోల్పోయాడు. తాను ఎదుర్కొన్న 15వ బంతిని సిక్స్‌గా మలిచాడు టోబీ కానీ..ఫాలో-త్రూలో అతని బ్యాట్ స్టంప్‌లకు తగిలింది. అప్పటికి బంతి ఇంకా బౌండరీ దాటలేదు. దీన్ని గమనించిన కీపర్ ఔట్ అంటూ అంపైర్ల కు అప్పీల్ చేశాడు. పలు మార్లు రిప్లేలను పరిశీలించిన అనంతరం టోబీను హిట్ వికెట్‌గా ఔటైనట్లు ప్రకటించారు.
నిబంధనల ప్రకారం బంతి బౌండరీ లైన్ దాటకపోవడంతో అతడిని ఔట్ ప్రకటించాడు. కాగా.. ఆ బంతికి పరుగులు ఏమీ రావు. బ్యాటర్ ఔట్‌గానే పరిగణిస్తారు. మొత్తంగా టోబీ ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 21 పరుగులు చేశాడు. మిడిల్‌సెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన వార్విక్ షైర్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.
టోబీ ఔట్‌కు సంబంధించిన వీడియోను కౌంటీ ఛాంపియన్‌షిప్ నిర్వాహకులు తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. “అవుట్ హిట్ వికెట్?! టోబి రోలాండ్-జోన్స్ అతను బంతి బౌండరీ లైన్ దాటినట్లు భావించాడు. కానీ అతని బ్యాట్ ఫాలో-త్రూలో బెయిల్స్‌ను పడగొట్టింది.’ అంటూ రాసుకొచ్చారు.
Out hit wicket?!
Toby Roland-Jones thinks he has planted the ball for six but knocks the bails off in his follow-through #LVCountyChamp pic.twitter.com/c0tJoutjr3
— LV= Insurance County Championship (@CountyChamp) July 25, 2023
Ajinkya Rahane : విండీస్‌తో టెస్టు సిరీస్‌లో విఫలమైన రహానే.. పుజారా గతే పడుతుందా..?
దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఎంత దురదృష్టమో నీది అంటూ కామెంట్లు చేస్తున్నారు.