Vizag Match: 5 వికెట్లు పడగొట్టి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల వెన్ను విరిచిన మిచెల్ స్టార్క్
కుల్దీప్ యాదవ్ 3, మోహత్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.

Pic: @IPL (X)
ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇవాళ విశాఖ స్టేడియంలో మ్యాచు జరుగుతోంది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్ల వద్ద 163 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ స్టార్క్‌కు ఈ మ్యాచులో 5 వికెట్లు తీసి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధారణంగా చూపించే జోరుకు కళ్లెం వేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 1, ట్రావిస్ హెడ్ 22, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 0,
అనికేత్ వర్మ74, హెన్రిచ్ క్లాసెన్ 32, అభినవ్ మనోహర్ 4, పాట్ కమిన్స్ 2, వియాన్ ముల్డర్ 9, హర్షల్ పటేల్ 5, మహ్మద్ షమీ 1 (నాటౌట్) పరుగులు చేశారు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్‌కు 5 వికెట్లు దక్కాయి. కుల్దీప్ యాదవ్ 3, మోహత్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.
Also Read: పీ-4 అంటే ఏంటి? ఉపయోగాలేంటి? దీని నుంచి మీకు ఏ ప్రయోజనాలు అందుతాయి?
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ , అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ