బ్రేకింగ్ : రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్

భారత మాజీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.

  • Published By: sreehari ,Published On : September 3, 2019 / 09:13 AM IST
బ్రేకింగ్ : రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్

Updated On : September 3, 2019 / 9:13 AM IST

భారత మాజీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.

భారత మాజీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. 36ఏళ్ల మిథాలీ.. భారత తరపున మొత్తం 32 టీ20 మ్యాచ్‌లు ఆడింది. అందులో మూడు ఎడిషన్లు (2012 (శ్రీలంక , 2014 (బంగ్లాదేశ్, 2016 ఇండియా) మహిళల వరల్డ్ కప్ టీ20 మ్యాచ్‌లు ఆడింది.

‘2006 నుంచి భారత మహిళా క్రికెట్ జట్టుకు టీ20అంతర్జాయ మ్యాచ్‌లకు కెప్టెన్ గా వ్యహరిస్తూ వచ్చాను. అంతర్జాతీయ టీ20ల నుంచి వీడ్కోలు పలకాలని భావిస్తున్నాను. రానున్న 2021 వన్ డే వరల్డ్ కప్ పైనే దృష్టి పెట్టాను. అందుకు తగినట్టుగా రెడీ కావాల్సిన అవసరం ఉంది. నా దేశం కోసం ప్రపంచ కప్ లో విజయం సాధించడమే నా కల. నాకు సాధ్యమైనంత వరకు కష్టపడతా’ అని మిథాలీ చెప్పినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 

‘భారత మహిళా టీ20ను ప్రోత్సహించిన బీసీసీఐకి నా కృతజ్ఞతలు. దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో హోం సిరీస్ కు సిద్ధమయ్యే భారత మహిళా టీ20 జట్టుకు నా శుభాకాంక్షలు’ అని మిథాలీ ట్వీట్ చేసింది. టీ20 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 2వేలు పరుగుల ల్యాండ్ మార్క్ చేరిన తొలి భారతీయ క్రికెటర్‌గా మిథాలీ నిలిచింది.

మరోవైపు.. భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ ల టీ20 హోం సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 24 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఫిబ్రవరి-మార్చి 2020లో ఆస్ట్ర్రేలియాలో టీ20 ప్రపంచ కప్ ఆడనుంది.