CSK vs PBKS : పంజాబ్ చేతిలో ఓటమి.. చెన్నై కెప్టెన్ ధోని కామెంట్స్ వైరల్.. అందుకే ఓడిపోయాం..
పంజాబ్ చేతిలో ఓడిపోవడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పందించాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. అధికారికంగా ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది. బుధవారం చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు చెన్నై 10 మ్యాచ్‌లు ఆడగా ఇది ఎనిమిదో ఓటమి కావడం గమనార్హం. లీగ్ దశలో చెన్నై మరో నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లో గెలిచినా, ఓడిపోయినా చెన్నైకి పెద్దగా ఉపయోగం లేదు. అయితే.. మిగిలిన జట్ల ప్లేఆఫ్స్ సమీకరణాలను దెబ్బతీయవచ్చు.
ఈ మ్యాచ్‌లో ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేసింది. 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. సీఎస్‌కే బ్యాటర్లలో సామ్ కర్రాన్ (88; 47 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ (32) రాణించాడు. పంజాబ్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హర్‌ప్రీత్ బ్రార్, అజ్మతుల్లా తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం శ్రేయస్ అయ్యర్ (72; 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (54; 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు బాదడంతో పంజాబ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సీఎస్‌కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ తలా ఓ వికెట్ సాధించారు.
పంజాబ్ చేతిలో ఓటమి పై చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని స్పందించాడు. మ్యాచ్ అనంతరం మహేంద్రుడు మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో సీఎస్కే బ్యాటర్లు తగినంత స్కోరు చేయడం ఇదే మొదటి సారి అని చెప్పుకొచ్చాడు. అయితే.. ఇది గెలిచే స్కోరు కాదని మరో 15 పరుగులు చేసి ఉంటే బాగుండేదని చెప్పాడు. సామ్, బ్రెవిస్ మధ్య భాగస్వామ్యం బాగుందన్నాడు. ఇక ఫీల్డింగ్ క్యాచ్‌లు మిస్ చేయడం తగదన్నాడు.
‘కరుణ్ ఓ యోధుడు. తనకు అవకాశం వచ్చినప్పుడు జట్టుకు సహకరించాలని కోరుకుంటూ ఉంటాడు. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు మేము అతడికి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు వికెట్ నెమ్మదిగా ఉంటూ వస్తోంది. అయితే.. ఈ పిచ్ బాగుంది. ఈ సీజన్‌లో హోంగ్రౌండ్‌లో మేము ఆడిన మ్యాచ్‌ల్లో ఇదే అత్యుత్తమ వికెట్.’ అని ధోని అన్నాడు.