హగ్ చేసుకోబోయి ధోనీ కాళ్లు పట్టుకున్నాడు

హగ్ చేసుకోబోయి ధోనీ కాళ్లు పట్టుకున్నాడు

Updated On : March 27, 2019 / 10:54 AM IST

మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలోకి దూసుకురావడం అభిమానులకు ఓ క్రేజ్ గా మారింది. సెక్యూరిటీ కంటపడకుండా మైదానంలోకి దూసుకెళ్లి అభిమాన ప్లేయర్లను కలుసుకుంటే ఏదో సాధించినంత ఆనందం.. ఇలాగే పలుమార్లు ధోనీ, కోహ్లీల అభిమానులు సెక్యూరిటీ ఆపేస్తున్నా.. పరిగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చేయడం చాలాసార్లు చూశాం. 

మరోసారి ధోనీ అభిమానులు ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో హల్‌చల్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ 145పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ముందుంచింది. లక్ష్య చేధనకు దిగిన చెన్నై జట్టులో ధోనీ.. బ్రావో చివరి ఓవర్ల వరకూ ఉండి మ్యాచ్‌ను ముగించారు. 6వికెట్ల తేడాతో విజయం దక్కించుకుని బ్రావో.. ధోనీలు వెనుదిరుగుతుండగా స్టేడియంలోకి దూసుకొచ్చిన అబిమాని ధోనీని హగ్ చేసుకునేందుకు ప్రయత్నించి షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషపడ్డాడు. 

వికెట్లు పడకుండా ఆచితూచి ఆడిన ధోనీ.. 35బంతుల్లో 32పరుగులు చేసి మ్యాచ్ కు ముగింపునిచ్చాడు. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు లీగ్‌లో రెండో విజయం సొంతమైంది. మూడో మ్యాచ్‌ను మార్చి 31న రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై వేదికగా ఆడనుంది. 
Read Also : ఐపీఎల్‌లో స్లెడ్జింగా: వాట్సన్‌పై ఇషాంత్ రెచ్చిపోయాడు