ధోనీ ఇంట్లో పార్టీ.. సందడి చేసిన టీమిండియా

ధోనీ ఇంట్లో పార్టీ.. సందడి చేసిన టీమిండియా

అతిథులను ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లిన ధోనీ.. అట్టహాసంగా డిన్నర్ విందు ఏర్పాటు చేశాడు. టీమిండియా మొత్తం వేడుకలో పాల్గొని కనువిందు జయప్రదం చేశారు. మార్చి 8 శుక్రవారం ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడో వన్డే జార్ఖండ్‌లోని రాంచీ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో టీమిండియా బుధవారం జార్ఖండ్ చేరుకుంది. తన సొంత ప్రదేశంలో మ్యాచ్ జరగనుండటంతో ధోనీ టీమిండియా సహచరులందరినీ డిన్నర్ కు ఆహ్వానించాడు. 
Also Read: మాకు తెలుసులే: యువీ నా భర్త చొక్కా తొడుక్కున్నాడు

వేడుకలో తీసిన ఫొటోలను బీసీసీఐ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ట్వీట్ చేసింది. రాంచీ ఎయిర్‍‌పోర్టులో దిగినప్పటి నుంచి ధోనీ ఇంట్లో జరిగిన పార్టీ వరకూ తీసిన ఫొటోలు వైరల్ గా మారాయి. వేడుకకు హాజరైన స్పిన్నర్ చాహల్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పోస్టు చేసి మహీ భాయ్.. సాక్షి భాబీకి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. 

టీమిండియా వరుసగా హైదరాబాద్, నాగ్‌పూర్‌లలో జరిగిన వన్డేలలో విజయం సాధించి సిరీస్ 2-0ఆధిక్యంతో దూసుకెళ్తోంది. జార్ఖండ్ వేదికగా జరగనున్న వన్డేలోనూ విజయం సాధిస్తే దాదాపు సిరీస్ మనకు చేజిక్కేసినట్లే. ఆ తర్వాత 2వన్డేలను నామమాత్రంగా ఆడితే సరిపోతుంది. తొలి వన్డేలో చివరి వరకూ క్రీజులో ఉండి జట్టును గెలిపించిన ధోనీ.. సొంతగడ్డపై ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

♥️♥️♥️

A post shared by Team India?? (@indiancricketteam7) on

Also Read: IPL 2019: యువీ ముంబై ఇండియన్స్ జెర్సీ‌పై ట్వీట్ల వర్షం