Dhoni Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్ బై

మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు చివరి వరల్డ్ కప్ మ్యాచ్‌యే ఆఖరిది. న్యూజిలాండ్ తో ఆడిన సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడటం లేదట. 2020 ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించేశాడు.
శనివారం ప్రకటించిన ధోనీ రిటైర్మెంట్ గురించి సంవత్సర కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గతేడాది జులైలో చివరి మ్యాచ్ ఆడిన ధోనీ స్టంప్స్ తీసుకుని వెళ్లడం పలు అనుమానాలకు తావిచ్చింది. గతంలో టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ సమయంలోనూ ధోనీ మ్యాచ్ ఆడిన బాల్ తీసుకుని వెళ్లడాన్ని అప్పట్లో బాగా గుర్తు చేసుకున్నారు. దాంతో పాటుగా ఈ సంవత్సర కాంట్రాక్ట్ ప్లేయర్లలో ధోనీ పేరు లేకపోవడం కూడా అనుమానాలు బలపడేలా చేసింది.