Video Viral: ఇలాగే ముందుకు వెళ్లి లెఫ్ట్ తీసుకుంటే ఏమొస్తుంది?: కారు ఆపి అడిగిన ధోనీ
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ప్రాంతంలో ధోనీ కారులో వెళ్తున్నాడు. అతడికి దారి తెలియకపోవడంతో..
Video Viral – MS Dhoni: ఐపీఎల్(IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ పదే పదే వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి నిరాడంబరతకు అభిమానులు ఫిదా అయిపోతారు. తాజాగా, ధోనీకి సంబంధించి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ప్రాంతంలో ధోనీ కారులో వెళ్తున్నాడు. అతడికి దారి తెలియకపోవడంతో సాధారణ వ్యక్తిలా కారు అద్దాన్ని కిందికి అని, రోడ్డుపై వెళ్తున్న వారిని దారి అడిగాడు. ఆ కారుని ధోనీ స్నేహితుడు నడిపిస్తున్నాడు. ముందుకు వెళ్తే రాంచీ వస్తుందని ఓ వాహనదారుడు ధోనీకి చెప్పాడు.
రెండో విగ్రహం నుంచి వెళ్లాలని చెబుతున్నారా? అని ధోనీ అడిగాడు. అవునని ఆ వాహనదారుడు అన్నాడు. బైక్పై వెళ్తున్న వారు ధోనీతో ఫొటోలు తీసుకున్నారు. కాగా, గత ఐపీఎల్ లో ధోనీ టీమ్ సీఎస్కే విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి ధోనీ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎంజాయ్ చేస్తూ కనపడుతున్నాడు. మోకాలి గాయం నుంచి ధోనీ కోలుకుంటున్నారని అతడి భార్య సాక్షి ఇటీవలే తెలిపింది. తదుపరి ఐపీఎల్ లో ధోనీ ఆడతారా? అన్న విషయంపై స్పష్టత లేదు.
This man is so simple and this simplicity is what makes him different from every other celebrity #MSDhoni #Dhoni pic.twitter.com/ErMlX3KGVX
— TAAGASTYA (@LalPatrakar) August 11, 2023
MS Dhoni: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ధోనీ బ్యాట్.. వేలంలో రికార్డు ధర.. ఆ డబ్బులు ఏం చేశారంటే?