HBD Dhoni-Video: హైదరాబాద్‌లో ధోనీ ఫ్యాన్స్ హంగామా.. 52 అడుగుల కటౌట్.. ఇంకా..

ధోనీ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అక్కడ ఫ్యాన్స్ డ్యాన్సులు చేస్తూ స్వీట్లు పంచుకున్నారు.

HBD Dhoni-Video: హైదరాబాద్‌లో ధోనీ ఫ్యాన్స్ హంగామా.. 52 అడుగుల కటౌట్.. ఇంకా..

Updated On : July 7, 2023 / 7:39 PM IST

HBD Dhoni – Hyderabad: టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ధోనీ ఫ్యాన్స్ ఎక్కువే. ఇవాళ ధోనీ 42వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ధోనీ ఫ్యాన్స్ హంగామా చేశారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద తాజాగా 52 అడుగుల ధోనీ కటౌట్ ఏర్పాటు చేశారు. ధోనీ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అక్కడ ఫ్యాన్స్ డ్యాన్సులు చేస్తూ స్వీట్లు పంచుకున్నారు. హైదరాబాద్ లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ధోనీ ఫ్యాన్స్ వేడుక చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ధోనీ పలువురు ప్రముఖుల నుంచి వస్తున్న శుభాకాంక్షల వెల్లువలో తడిసి ముద్దవుతున్నాడు. కాగా, ఐపీఎల్-2023 కప్ ను మహేంద్ర సింగ్ ధోనీ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ధోనీ జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు ఇదే.