IPL 2021 : దంచికొట్టిన ముంబై బ్యాటర్లు.. సన్‌ రైజర్స్ ముందు భారీ లక్ష్యం

సన్ రైజర్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు అదరగొట్టారు. 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేశారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

IPL 2021 : దంచికొట్టిన ముంబై బ్యాటర్లు.. సన్‌ రైజర్స్ ముందు భారీ లక్ష్యం

Ipl 2021

Updated On : October 8, 2021 / 10:06 PM IST

IPL 2021 : సన్ రైజర్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు అదరగొట్టారు. 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేశారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కేవలం 32 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. 16 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ సన్‌రైసర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 40 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. వీరిద్దరి విధ్వంసకర బ్యాటింగ్ తో ముంబై భారీ స్కోరు చేసింది.

Read More : IPL 2021 : మోకాళ్లపై కూర్చొని గర్ల్ ఫ్రెండ్‌‌కు ప్రపోజ్ చేసిన దీపక్ చాహార్

టాస్ గెలిచిన ముంబై ఇండియాన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నంత సేపు ఫోర్ల వర్షం కురిసింది. ఇషాన్ దూకుడుగా ఆడుతున్న సమయంలోనే 5 ఓవర్ 3వ బంతికి మరో ఓపెనర్ రోహిత్ శర్మ 18 పరుగుల వద్ద వెనుదిరిగాడు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో మహమ్మద్ నబికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ ఔటైనప్పటికి ఇషాన్ తన దూకుడు కొనసాగించాడు. ఇషాంత్ దూకుడుతో 10 ఓవర్లలోనే ముంబై స్కోర్ బోర్డ్ 130 దాటింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టు 4 ఓవర్లలో 48 పరుగులు చేసింది.