Champions Trophy 2025: కేఎల్ రాహుల్‌ను టీమ్‌ మేనేజ్‌మెంట్ ఎంతగా, ఎలా వాడుకుందంటే..: సిద్ధూ

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు.

Champions Trophy 2025: కేఎల్ రాహుల్‌ను టీమ్‌ మేనేజ్‌మెంట్ ఎంతగా, ఎలా వాడుకుందంటే..: సిద్ధూ

Updated On : March 6, 2025 / 7:31 PM IST

భారత క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను టీమ్‌ మేనేజ్‌మెంట్ బాగా వాడేసుకుందని, అసలు స్పేర్‌ టైర్‌ను కూడా అలా ఎవరూ వాడరని మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్ధూ మాట్లాడారు.

కేఎల్‌ రాహుల్‌తో వికెట్‌ కీపింగ్‌ చేయిస్తారని, అలాగే, 6వ స్థానంలో బ్యాటింగ్‌కి దింపుతుంటారని సిద్ధూ చెప్పారు. అతడని పలుసార్లు ఓపెనింగ్‌కి కూడా పంపిస్తారని తెలిపారు. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో కేఎల్‌ రాహుల్‌ను మూడో స్థానంలో పంపుతారని, పేసర్లను తట్టుకోవడానికి ఇలా చేస్తుంటారని చెప్పారు.

మరో మ్యాచులో తిరిగి ఓపెనింగ్‌ బ్యాటర్‌గా వెళ్లాలని చెబుతారని సిద్ధూ అన్నారు. వన్డేల్లో ఓపెనర్‌గా వెళ్లడం సులువైన విషయమేనని, అయితే, టెస్టుల్లో ఓపెనింగ్‌కు వెళ్లడం చాలా కష్టమని తెలిపారు. ఏ సమయంలో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయో ఆ సమయంలో ఆ స్థానంలో ఆడాలని కేఎల్‌ రాహుల్‌కు చెబుతారని అన్నారు.

కేఎల్ రాహుల్‌ కూడా కాదనకుండా వారి చెప్పినట్లు చేస్తాడని, అతడు నిస్వార్థంగా ఆడతాడని సిద్ధూ తెలిపారు. దేశం కోసం అప్పట్లో భగత్‌ సింగ్‌ కూడా నిస్వార్థంగా త్యాగం చేశారని, అందుకే ఆయనకు గొప్ప పేరు వచ్చిందని వ్యాఖ్యానించారు.

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. 265 పరుగుల చేజ్‌లో కేఎల్ రాహుల్ 42 పరుగులు తీసి నాటౌట్‌గా నిలిచాడు. కేఎల్‌ రాహుల్ తన కెరీర్‌లో మొత్తం 84 వన్డేలు ఆడి, 3,009 రన్స్‌ చేశాడు. ఈ నెల 9న న్యూజిలాండ్‌తో భారత్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది.