నువ్వే ఇలా అంటే : వరల్డ్ కప్‌కు సత్తా సరిపోదంటున్న కోహ్లీ

ఒకవేళ ఆ పరిస్థితుల్లోనూ రాణించినట్లు అయితే 350కి మించిన స్కోరు చేసుండేవాళ్లం. సరిగ్గా 34నుంచి 40ఓవర్ల మధ్యలో పరుగులు రాబట్టాలి.

నువ్వే ఇలా అంటే : వరల్డ్ కప్‌కు సత్తా సరిపోదంటున్న కోహ్లీ

Updated On : June 22, 2021 / 1:04 PM IST

ఒకవేళ ఆ పరిస్థితుల్లోనూ రాణించినట్లు అయితే 350కి మించిన స్కోరు చేసుండేవాళ్లం. సరిగ్గా 34నుంచి 40ఓవర్ల మధ్యలో పరుగులు రాబట్టాలి.

న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టి వరుసగా రెండు వన్డేలలోనూ విజయపతాకాన్ని ఎగరేసింది టీమిండియా. తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో విజయం సాధిస్తే, రెండో వన్డేలో 90పరుగుల ఆధిక్యంతో విజేతగా నిలిచింది. ఐదు వన్డేల సిరీస్‌లో ఇంకా ఒక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ మన వశమైనట్లే. లాంఛనంగా మిగిలినవి రెండూ పూర్తి చేస్తే సరిపోతుంది.

పర్యాటక జట్టుపై ఆధిపత్యం చెలాయిస్తూ దూకుడు మీద సాగుతున్న టీమిండియా బ్యాటింగ్ సరిపోవడంలేదట. రెండో వన్డే మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ప్రపంచ కప్ టోర్నీకి ఈ బ్యాటింగ్‌తో రాణిస్తే సరిపోదు. దానికి మరింత రాటుదేలాల్సి ఉందని పేర్కొన్నాడు.

‘325 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టుకు ఇచ్చి అద్భుత ప్రదర్శన చేశాం. కివీస్ బ్యాటింగ్‌కు ఇది పెద్ద టార్గెటేనని చెప్పాలి. జట్టు సమన్వయంతో ఆడడంతో గెలిచాం. కానీ, మిడిల్ ఓవర్స్‌లో పరుగులు చేయలేకపోయాం. ఒకవేళ ఆ పరిస్థితుల్లోనూ రాణించినట్లు అయితే 350కి మించిన స్కోరు చేసుండేవాళ్లం. సరిగ్గా 34నుంచి 40ఓవర్ల మధ్యలో పరుగులు రాబట్టాలి. రానున్న ప్రపంచ కప్‌కు ముందు టీమిండియా సవరించుకోవాల్సిన అంశాలలో ఇదొకటి. శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు చక్కటి ఇన్నింగ్స్ అందించారు. బౌలింగ్ విభాగం కూడా బాగుంది’ అని కెప్టెన్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు.