IPL 2023: విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆటగాడిని.. శిక్షించిన ముంబై ఇండియన్స్..!
నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో పాలుపంచుకుంటున్నాడు 22 ఏళ్ల నెహాల్ వధేరా. అయితే అతడికి ముంబై ఇండియన్స్ శిక్ష విధించింది. అది బాగా ఆడుతున్నందుకు కాదట. అతడు చేసిన ఓ పని కారణంగా ఫన్నీ పనిష్మెంట్‌ను వేశారట

Nehal Wadhera
NehalWadhera: ఐపీఎల్(IPL) 2023 సీజన్‌ను ఓటములతో ఆరంభించిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఆ తరువాత పుంజుకుంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై 7 మ్యాచుల్లో గెలిచి 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక ముంబై ఇండియన్స్ సాధించిన విజయాల్లో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తుండగా మరో యువ ఆటగాడు సైతం నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో పాలుపంచుకుంటున్నాడు. అతడే 22 ఏళ్ల నెహాల్ వధేరా(NehalWadhera).
అయితే.. అతడికి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పనిష్మెంట్ ఇచ్చింది. అదేమిటి..? బాగా ఆడే ఆటగాడికి శిక్షను ఎందుకు విధించారు అని అంటారా..? అక్కడికే వస్తున్నాం ఆగండి. మంచిగా ఆడుతున్నందుకు అతడికి పనిష్మెంట్ వేయలేదు. జట్టు సమావేశానికి లేటుగా రావడంతో సరదాగా శిక్ష విధించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ముంబై ఫ్రాంచైజీ తమ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.
ముంబై జట్టు తన తదుపరి మ్యాచ్‌ను మే 16న లక్నోతో ఆడనుంది. ఇందుకోసం ముంబై జట్టు లక్నోకు బయలు దేరింది. అయితే ఎయిర్ పోర్టులో అందరి దృష్టి నెహాల్ వధేరా పైనే పడింది. అందుకు కారణం అతడు ప్యాడ్లు ధరించి రావడమే. జట్టు సమావేశానికి లేటుగా రావడంతో అతడికి ఈ శిక్ష విధించారట.
#MumbaiIndians youngster #NehalWadhera turned all heads at Mumbai airport with his punishment #OOTD. He was captured with his pads on instead of traditional jumpsuit. According to our sources, #Nehal regrets being late for batters meeting. pic.twitter.com/vCzenvIWzC
— Mumbai Indians (@mipaltan) May 13, 2023
“ముంబై ఎయిర్ పోర్టులో అందరి చూపును తన వైపుకు తిప్పేసుకున్నాడు యువ ఆటగాడు నెహల్ వధేరా. సాధారణ జంప్ సూట్‌కు బదులు ప్యాడ్లతో కనిపించడమే కారణం. ఇది చూసిన అక్కడి వారు ఆశ్చర్యపోయారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జట్టు సమావేశానికి ఆలస్యంగా రావడంతోనే ఇలా షనిష్మెంట్‌ను ఎదుర్కొన్నాడు.” అంటూ వీడియోను షేర్ చేస్తూ ముంబై తెలిపింది.
గతేడాది జరిగిన మినీ వేలంలో నెహల్ వధేరాను ముంబై ఇండియన్స్ రూ.20లక్షలకు సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో 100 మీటర్ల కంటే ఎక్కువ దూరం సిక్స్ కొట్టిన మొదటి ఆటగాడిగా వధెరా నిలిచాడు. ఈ సీజన్‌లోనే ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన వధేరా 10 ఇన్నింగ్స్‌ల్లో 151.15 స్ట్రైక్ రేట్‌తో 198 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి.