Kane Williamson: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం.. రంగంలోకి టిమ్ సౌథీ
చాలాకాలం పాటు క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహిస్తున్న న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్టుల్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. 2016లో బ్రెండన్ మెకల్లమ్ తరువాత టెస్ట్ ఫార్మాట్‌లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విలియమ్సన్ 38మ్యాచ్ లు ఆడారు. వీటిల్లో ...

kane williamson
Kane Williamson: చాలాకాలం పాటు క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహిస్తున్న న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్టుల్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. 2016లో బ్రెండన్ మెకల్లమ్ తరువాత టెస్ట్ ఫార్మాట్‌లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విలియమ్సన్ 38మ్యాచ్ లు ఆడారు. వీటిల్లో 22 విజయాలు కాగా, ఎనిమిది డ్రాలు, 10 ఓటములు ఉన్నాయి. అయితే, విలియమ్సన్ అనూహ్య నిర్ణయంతో ఆ జట్టు కీలక ఆటగాడు టీమ్ సౌథీ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.
Kane Williamson: హైదరాబాద్ కెప్టెన్‌గా విలియమ్సన్..
విలియమ్సన్ అన్ని ఫార్మాట్లలో 333 మ్యాచ్‌లు ఆడగా 193 సార్లు న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, కేన్ విలియమ్సన్ కేవలం టెస్ట్ మ్యాచ్‌లకు మాత్రమే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వన్డే, టీ20 ఫార్మాట్లకు కేన్ నాయకత్వం వహించనున్నాడు. 2023లో వరల్డ్ కప్, 2024లో టీ20 వరల్డ్ కప్‌లను దృష్టిలో ఉంచుకొని వన్డే, టీ20 మ్యాచ్‌లకు కేన్ నాయకత్వ బాధ్యతలు వహిస్తాడని న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉండటం వల్ల ఒత్తిడి పెరుగుతుందని, నా కెరీర్ లో ఈ దశలో ఈ నిర్ణయం సరైనదేనని భావిస్తున్నానని విలియమ్సన్ అన్నారు. కెప్టెన్‌గా టిమ్, వైస్ కెప్టెన్‌గా టామ్‌కు మద్దతు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని విలియమ్సన్ తెలిపారు.
India vs New Zealand: రేపటి నుంచి వన్డే మ్యాచులు… ట్రోఫీతో భారత్-న్యూజిలాండ్ సారథులు ఫొటోలు
టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలపై టిమ్ సౌథీ తన ఆనందాన్ని వెలిబుచ్చాడు. టెస్ట్ కెప్టెన్ గా నన్ను నియమించడం చాలా సంతోషంగా ఉంది. నేను టెస్ట్ క్రికెట్ ను అమితంగా ప్రేమిస్తాను. ఇది అనేక సవాళ్లతో కూడుకున్న బాధ్యత. కేన్ అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్సీకి సమానంగా నేనుకూడా అదేస్థాయిలో బాధ్యతలు నిర్వహించేందుకు కృషిచేస్తాను. ఈ విషయంలో గ్యారీతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానని అన్నాడు. అయితే, డిసెంబర్ 26 నుంచి పాకిస్థాన్‌తో న్యూజీలాండ్ తొలి టెస్ట్ ఆడనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌కు టెస్ట్ కెప్టెన్‌గా 31 వ్యక్తి టీమ్ సౌథీ అవుతాడు.