టోర్నమెంట్‌ను ఇలా ముగించాలనుకోలేదు: ప్రీతి జింతా

టోర్నమెంట్‌కు మేం ఊహించిన ముగింపు ఇది కాదు. చివరి మ్యాచ్ విజయంతో ముగించడం సంతోషంగా ఉంది. అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.

టోర్నమెంట్‌ను ఇలా ముగించాలనుకోలేదు: ప్రీతి జింతా

Updated On : May 6, 2019 / 1:51 PM IST

టోర్నమెంట్‌కు మేం ఊహించిన ముగింపు ఇది కాదు. చివరి మ్యాచ్ విజయంతో ముగించడం సంతోషంగా ఉంది. అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.

ఆరంభంలో దూకుడు కనిపించే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్లు మరోసారి ప్లేఆఫ్ అర్హత కోల్పోయారు. ఐపీఎల్ 12ఏళ్ల చరిత్రలో 2014లో ఒక్కసారి  మాత్రమే ఫైనల్ చేరుకుంది పంజాబ్. 2019 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పాటు వరుస పెట్టి ఇంటి ముఖం పట్టింది కింగ్స్ జట్టు. ఈ సందర్భంగా జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింతా అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేసింది.

‘టోర్నమెంట్‌కు మేం ఊహించిన ముగింపు ఇది కాదు. చివరి మ్యాచ్ విజయంతో ముగించడం సంతోషంగా ఉంది. అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అన్ని సీజన్లలో వారు చూపించిన అభిమానం ఎనలేనిది. వచ్చే ఏడాది బెటర్& స్ట్రాంగ్‌గా తిరిగొస్తాం’ అని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. 

బెంగళూరు 11 పాయింట్లతో ముగిస్తే పంజాబ్ 12పాయింట్లతో  సరిపెట్టుకుంది. సీజన్‌లో పంజాబ్ కెప్టెన్ అశ్విన్ మాన్కడింగ్ పద్ధతి మాత్రం బ్యాట్స్‌మెన్‌కు గుర్తుండిపోయేలా చేసింది. లీగ్ జరుగుతున్న సమయంలోనే జట్టు యజమానులలో ఒకరైన నెస్ వాడియా డ్రగ్ర్స్ కేసులో జపాన్‌లో అరెస్టు అయ్యారు. ఈ సందర్భంగా ప్రీతి జింతా తన ట్విట్టర్ ద్వారా తన అసంతృప్తిని వెళ్లగక్కింది.