French Open 2023: చరిత్ర సృష్టించిన టెన్నిస్ దిగ్గజం జకోవిచ్.. పురుషుల సింగిల్స్‌లో సరికొత్త రికార్డు
సెర్బియా యోధుడు, టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో విజయంతో పురుషుల సింగిల్స్ టెన్నిస్ లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న ప్లేయర్‌గా రికార్డు సాధించాడు.

Novak Djokovic
Novak Djokovic: సెర్బియా యోధుడు, టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ (French Open 2023) టైటిల్ ను మూడోసారి సాధించడంతో పాటు మరో టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ (Rafael Nadal) రికార్డును బద్దలు కొట్టాడు. నాదల్ ఇప్పటి వరకు పురుషుల సింగిల్స్ టెన్నిస్ (Mens Singles Tennis) లో 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకోగా.. జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో విజయంతో 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. తద్వారా ప్రపంచ నెం. 3 స్థానం నుంచి తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో 36ఏళ్ల జకోవిచ్ నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (Casper Ruud) (నార్వే)ను 7-6, 6-3, 7-5తేడాతో ఓడించాడు. అయితే, 36ఏళ్ల వయస్సులో 20 రోజులు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన పెద్ద వయస్సు ఆటగాడిగానూ జకోవిచ్ నిలిచాడు.
WTC Final: భారత్ ఘోర ఓటమి.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా..
23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో సరికొత్త చరిత్ర ..
నొవాకో జకోవిచ్ 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ విజయాల జాబితాలో అగ్రస్థానానికి జకోవిచ్ చేరుకున్నారు. నాడల్ 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ తో రెండో స్థానంలో నిలవగా, ఫెడరర్ 20 టైటిల్స్‌తో మూడో స్థానంలో ఉన్నారు. జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ ను 10సార్లు (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023) గెలుచుకున్నారు. అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్‌ను మూడు సార్లు ( 2016, 2021, 2023), వింబుల్డన్‌ను ఏడు సార్లు (2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022) గెలుచుకున్నాడు.
అదేవిధంగా మూడు సార్లు యూఎస్ ఓపెన్ (2011, 2015, 2018 సంవత్సరాల్లో) గెలుచుకున్నాడు. ఒవరాల్ టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్ గా సెరెనా విలియమ్స్ తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో అత్యధిక టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.
Many congrats on this amazing achievement @DjokerNole
23 is a number that just a few years back was imposible to think about, and you made it!
Enjoy it with your family and team! ??— Rafa Nadal (@RafaelNadal) June 11, 2023
జకొవిచ్ సరికొత్త రికార్డును నెలకొల్పడంతో మరో టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ దక్కించుకోవటం అనేది కొన్ని సంవత్సరాల క్రితం ఆలోచించడం సాధ్యంకాని సంఖ్య. మీరు దాన్ని చేరుకున్నారు. ఈ ఆనందాన్ని మీ కుటుంబం, మీ బృందంతో పంచుకోండి అంటూ నాదల్ పేర్కొన్నారు.