ODI World Cup 2023 : భారత్ – పాక్ మ్యాచ్ అంటే అట్లుంటది మరి..! అభిమానులకోసం ప్రత్యేక రైళ్లు.. ఏఏ ప్రాంతాల నుంచి అంటే?

భారత్ వేదికగా జరుగుతున్నవన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అంటే వచ్చే కిక్కే వేరు. ఈ రెండు జట్లు మైదానంలో తలపడుతుంటే చేసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే..

ODI World Cup 2023 : భారత్ – పాక్ మ్యాచ్ అంటే అట్లుంటది మరి..! అభిమానులకోసం ప్రత్యేక రైళ్లు.. ఏఏ ప్రాంతాల నుంచి అంటే?

india vs pakistan match

India vs Pakistan Match ODI World Cup 2023 : భారత్ వేదికగా జరుగుతున్నవన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ అంటే వచ్చే కిక్కే వేరు. ఈ రెండు జట్లు మైదానంలో తలపడుతుంటే చేసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే, ఆ సమయం రానేవచ్చింది. ఈనెల 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లు హాట్ కేకుల్లా విక్రయాలు జరిగాయి. ఈ ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సైతం సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం ముంబయి నుంచి అహ్మదాబాద్ కు ఓ వందే భారత్ సహా రెండు ప్రత్యేక రైళ్లను పశ్చిమ రైల్వే నడపనుంది.

Team india

Team india

Read Also : World Cup 2023 IND vs AFG ODI : రోహిత్ పెను విధ్వంసం.. అఫ్గానిస్థాన్ పై భార‌త్ ఘ‌న విజ‌యం..

ఓ క్రీడా ఈవెంట్ కోసం తొలిసారిగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబయి నుంచి అహ్మదాబాద్ కు పూర్తి ఏసీతో కూడిన ఓ రైలు శుక్రవారం రాత్రి 9.30 గంటలకు బయలుదేరుతుంది. తరువాతి రోజు ఉదయం 5.30 గంటలకు అహ్మదాబాద్ కు చేరుకుంటుంది. అదేవిధంగా అహ్మదాబాద్ నుంచి మ్యాచ్ మరుసటిరోజు (ఆదివారం) తెల్లవారు జామున 4గంటలకు రైలు బయలుదేరుతుంది. మధ్యాహ్నం సమయానికి ముంబయికి చేరుకుంటుంది. మరోైవైపు ఈ మ్యాచ్ కోసం భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తోన్నట్లు తెలిసింది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభ వేడుక‌లు నిర్వహించని విషయం తెలిసిందే. అయితే, ఆ స్థాయిలో వేడుకలను తలపించేలా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ కు ముందు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

cricket stadium

cricket stadium

Read Also : Virat Kohli : న‌వీన్ ఉల్ హ‌క్ ర‌నౌట్ ఛాన్స్‌ను మిస్ చేసిన రాహుల్‌.. కోహ్లీ రియాక్ష‌న్ వైర‌ల్‌

భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ కు ముందు ప్రత్యేక కార్యక్రమాన్ని బీసీసీఐ నిర్వహించనుందని సమాచారం. ఈ కార్యక్రమంలో సచిన్ టెండుల్కర్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లను బీసీసీఐ ఆహ్వానించినట్లు తెలిసింది. వీరితో పాటు ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరవుతారని సమాచారం. ఇదిలాఉంటే ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం పాక్ బుధవారం అహ్మదాబాద్ చేరుకుంది. ఉప్పల్ స్టేడియంలో నెదర్లాండ్స్, శ్రీలంక జట్లతో జరిగిన మ్యాచ్ లలో విజయం సాధించిన పాకిస్థాన్ జట్టు బుధవారం సాయంత్రంకు అహ్మదాబాద్ కు చేరుకుంది.